Share News

West Godavari: రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ABN , Publish Date - Jan 08 , 2025 | 09:00 AM

ప.గో. జిల్లా: రాజమండ్రిలో బుధవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్నాయి. చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్‌లర్‌ కేవీవీ సత్యనారాయణరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను వర్సిటీలో ఆవిష్కరించారు.

West Godavari: రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలు

ప.గో. జిల్లా: రాజమండ్రి (Rajahmundry)లో బుధవారం ప్రపంచ తెలుగు మహాసభలు (World telugu conference) ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటు జరగనున్నాయి. రాజానగరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) (Godavari Global University) వేదికగా జరుగుతాయి. ఈ మహా సభలు ప్రారంభోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana), కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతారు. ఇంకా 560 మంది కవులు పాల్గొంటున్నారు. నన్నయ, రాజరాజ నరేంద్రుడు, కందుకూరి పేర్లతో మూడు వేదికలపై మహాసభలు జరగనున్నాయి.


చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు జీజీయూ చాన్స్‌లర్‌ కేవీవీ సత్యనారాయణరాజు (KVV Satyanarayana Raju) తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం వర్సిటీలో ఆవిష్కరించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పాలనే సంకల్పంతో రెండు రోజులు సభలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం వర్సిటీ ప్రాంగణంలో నన్నయ, రాజరాజ నరేంద్ర, వీరేశలింగం పేరిట వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మహాసభలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, న్యాయకోవిదులు, భాషా పండితులు, సినీ నటులు, రచయితలు హాజరవుతారని చెప్పారు. కాగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటా: కేటీఆర్

విశాఖ పర్యటనకు పీఎం మోదీ..

అరెస్టుకు వేళాయెనా..?

బ్యాంకులదే పూర్తి బాధ్యత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 08 , 2025 | 09:00 AM