China Apps: మార్కెట్లోకి నిషేధిత చైనా యాప్స్.. ఎంతకు తెగించార్రా
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:33 PM
చైనా వాళ్ల ఫోకస్ ఎక్కువగా ఇండియాపైనే ఉంటుందని చెప్పవచ్చు. భారతీయులు వినియోగించే అనేక రకాల యాప్స్ సహా ఉత్పత్తలపై వ్యాపారాలు చేస్తూ దోచేస్తుంటారు. ఈ క్రమంలో భారత్ బ్యాన్ చేసిన పలు చైనా యాప్స్ మళ్లీ మార్కెట్లోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

చైనా(china) టార్గెట్ ప్రధానంగా భారత్‌పైనే (india) ఉంటుంది. చైనా మాంజా నుంచి మొదలుకుని బొమ్మలు, పలు రకాల యాప్స్ పేరుతో ఇండియాలోకి ప్రవేశించి దోచేకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నిషేధించిన చైనా యాప్స్ మళ్లీ భారత మార్కెట్లోకి వచ్చాయి. అయితే 2020లో భారతదేశం భద్రతా ఆందోళనల కారణంగా దాదాపు 267 చైనీస్ యాప్‌లను నిషేధించింది. గల్వాన్ లోయలో చైనా భారత సరిహద్దు ఘర్షణ తర్వాత, దేశంలోని భద్రతా పరిస్థితులు బలహీనమైనాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అనేక రోజులు ఈ యాప్స్ కనిపించకుండా పోయాయి.
రూపాన్ని మార్చుకుని..
అయితే తాజాగా వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ యాప్‌లు వాటి అసలు రూపాన్ని మార్చుకుని, వేర్వేరు పేర్లతో తిరిగి మార్కెట్‌లో ప్రవేశించాయి. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో గతంలో నిషేధంలో ఉన్న దాదాపు 36 యాప్‌లు ప్రస్తుతం డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌లు కొన్ని అంగీకరించిన మార్పులతో తిరిగి రావడంతోపాటు వాటి అసలు గుర్తింపు, లోగో, బ్రాండింగ్, యాజమాన్యాన్ని మార్చుకున్నాయి. గేమింగ్, షాపింగ్, వినోదం, ఫైల్ షేరింగ్, కంటెంట్ సృష్టి వంటి విభాగాల్లో ఈ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలోకి తిరిగి వచ్చిన ముఖ్యమైన యాప్‌లు
Xender - ఫైల్ షేరింగ్ సర్వీస్ యాప్. ఇది Apple యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. కానీ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు
MangoTV & Youku - ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో టీవీ కంటెంట్ ఉండగా, ఇప్పుడు గుర్తింపు మార్చుకోకుండా పనిచేస్తుంది
Taobao - ప్రముఖ షాపింగ్ యాప్ Taobao, ఇప్పుడు Mobile Taobaoగా కనిపిస్తోంది. ఇది ముందుగా ఉన్న విధంగా పనిచేస్తుంది
Tantan - ప్రముఖ డేటింగ్ యాప్ Tantan, ఇప్పుడు TanTan - Asian Dating Appగా రీబ్రాండ్ చేసుకుంది
షీన్ రీ బ్రాండింగ్
షీన్ ప్రఖ్యాత ఫ్యాషన్ రిటైలర్. ఇది తిరిగి భారత్‌లోకి వచ్చి, రిలయన్స్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకోవడంతో తన స్థానాన్ని దృవీకరించుకుంది. భారత ప్రభుత్వ అంగీకారంతో షీన్ అన్ని వినియోగదారుల డేటా ఇప్పుడు భారత్‌లోనే నిల్వ చేయబడుతుంది. చైనీస్ సంస్థకు ఎటువంటి యాక్సెస్ ఉండదు.
ఇతర యాప్‌లు, క్లోన్‌లు
నిషేధించబడిన యాప్‌ల క్లోన్ వెర్షన్‌లు కూడా కొన్ని సందర్భాల్లో తిరిగి వచ్చినట్లు గుర్తించబడింది. ఈ తరహా మార్పులతో కొన్ని యాప్‌లు చిన్న సవరణలతో తిరిగి మార్కెట్‌లో ప్రవేశించాయి. ఉదాహరణకు PUBG Mobile 2020లో నిషేధించబడింది. కానీ 2021లో దక్షిణ కొరియా క్రాఫ్టన్ క్రింద Battlegrounds Mobile India (BGMI)గా తిరిగి వచ్చింది. ఈ వెర్షన్ కూడా 2022లో మరో నిషేధాన్ని ఎదుర్కొంది. కానీ భద్రతా ప్రమాణాల ప్రకారం 2023లో పునరుద్ధరించబడింది.
అమలు చేయడం కష్టమా..
ప్రభుత్వం ఈ యాప్‌లను నిషేధించడానికి చర్యలు తీసుకున్నప్పటికీ, వాటి అసలు రూపాన్ని మారుస్తూ, విడివిడిగా పలు రకాల పేర్లతో ప్రత్యామ్నాయ వెర్షన్‌లు, క్లోన్‌ల ద్వారా మళ్లీ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ యాప్‌లను నిషేధించడం కష్టమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ప్రభుత్వం పలు చైనా యాప్స్‌కి పర్మిషన్ ఇచ్చిందా అని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Ayodhya Chief Priest: అయోధ్య ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూత
Court: భార్యతో ఇష్టం లేకుండా అసహజ శృంగారం నేరం కాదు.. కోర్టు సంచలన తీర్పు
Narendra Modi: ఇన్వెస్ట్ మెంట్స్ గురించి మోదీ కీలక వ్యాఖ్యలు.. ఇదే సరైన సమయమని వెల్లడి
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News