Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
ABN , Publish Date - Jan 27 , 2025 | 09:18 AM
ఫిబ్రవరి 2025 నెల రానే వచ్చింది. అయితే ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి, ఎన్ని రోజులు పనిచేయనున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఫిబ్రవరి 2025 నెల వచ్చేసింది. ఈ నెలలో మీకు బ్యాంకింగ్ సంబంధిత ఏదైనా పని ఉంటే ఈ సెలవుల (Bank Holidays) గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోండి. లేదంటే సెలవుల రోజు మీరు బ్యాంకులకు వెళితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే ఆర్‌బీఐ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వీటిలో వారాంతపు సెలవులు (శనివారం, ఆదివారం), కొన్ని ప్రాంతీయ పండుగలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం ఫిబ్రవరి 28 రోజుల్లో దాదాపు సగం రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవుల జాబితా
ఫిబ్రవరి 2: ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 3: సరస్వతి పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 8: నెలలో రెండవ శనివారం కావడంతో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది
ఫిబ్రవరి 9: ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 11: థాయ్ పూసం కారణంగా చెన్నైలో బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 12: గురు రవిదాస్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 15: లుయి-న్గై-ని కారణంగా ఇంఫాల్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 16: ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బేలాపూర్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 20: రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటానగర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 22: నెలలో నాల్గవ శనివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 23: ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి
ఫిబ్రవరి 26: మహాశివరాత్రి కారణంగా అగర్తలా, గ్యాంగ్ టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోల్‌కతా, కోహిమా, ఢిల్లీ, పాట్నా, పనాజీ, షిల్లాంగ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
ఫిబ్రవరి 28: గాంగ్‌టక్‌లో లోసర్ సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి
ఆన్‌లైన్ బ్యాంకింగ్ మాత్రం..
ఈ బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాలలో మారే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల స్థానిక పండుగల ఆధారంగా సెలవులు నిర్ణయించబడ్డాయి. ఈ రోజుల్లో బ్యాంకు శాఖలు మూసివేయబడినప్పటికీ, కస్టమర్లకు ఎటువంటి సమస్య ఉండదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల సహాయంతో మీరు ఇంట్లో కూర్చొని మీ బ్యాంకింగ్ పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మాధ్యమం ద్వారా అందుబాటులో ఉన్నాయి. దీని కారణంగా సెలవు దినాలలో కూడా లావాదేవీలకు అంతరాయం ఉండదు.
ఇవి కూడా చదవండి:
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News