Share News

Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. భోగి రోజు ఉంటాయా లేదా..

ABN , Publish Date - Jan 10 , 2025 | 07:06 PM

మీరు వచ్చే వారంలో ఏదైనా బ్యాంక్ పనుల కోసం వెళ్తున్నారా. అయితే ముందుగా ఈ బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకుని వెళ్లండి మరి. ఎందుకంటే రేపటి నుంచి బ్యాంకులకు దాదాపు నాలుగు రోజులు వరుస సెలవులు వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays: రేపటి నుంచి బ్యాంకులకు వరుస సెలవులు.. భోగి రోజు ఉంటాయా లేదా..
Bank Holidays January Bhogi

మీరు వచ్చే వీక్ ఏదైనా బ్యాంక్ పని కోసం వెళ్తున్నారా. అయితే ముందు ఈ బ్యాంక్ హాలిడే (Bank Holidays) వివరాలను తెలుసుకోండి. ఎందుకంటే రేపటి (జనవరి 11) నుంచి బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. మీరు సెలవుల గురించి తెలుసుకోకుండా బ్యాంకుకు వెళితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంకులు మూసివేయడం వల్ల చెక్ బుక్, పాస్ బుక్‌తో సహా అనేక బ్యాంకింగ్ సంబంధిత పనులు ప్రభావితమవుతాయి. అయితే ఈ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయానే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఆర్బీఐ ప్రకారం జనవరి 2025లో బ్యాంకు సెలవుల జాబితా

  • జనవరి 11, 2025 (శనివారం): రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి

  • జనవరి 12, 2025 (ఆదివారం): ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి

  • జనవరి 13, 2025 (సోమవారం): బోగి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు తెరిచే ఉంటాయి

  • జనవరి 14, 2025 (మంగళవారం): మకర సంక్రాంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, అసోం, యూపీ రాష్ట్రాల్లో సెలవు

  • జనవరి 15, 2025 (బుధవారం): తిరువళ్లువర్ దినోత్సవం, మాఘ బిహు పూజల కారణంగా తమిళనాడు చెన్నైలో మాత్రమే బ్యాంకులు బంద్ ఉంటాయి


  • జనవరి 16, 2025 (గురువారం): ఉజ్జవర్ తిరునాల్ సందర్భంగా కూడా తమిళనాడు చెన్నైలో బ్యాంకులకు సెలవు

  • జనవరి 19, 2025 (ఆదివారం): ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి

  • జనవరి 23, 2025 (గురువారం): నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అగర్తలా, భువనేశ్వర్, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు

  • జనవరి 25, 2025 (శనివారం): నెలలో నాల్గో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్

  • జనవరి 26, 2025 (ఆదివారం): గణతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి


వినియోగంలో ఈ సేవలు...

మీరు బ్యాంకు పనుల కోసం వెళితే ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ బ్యాంకు సెలవులను గుర్తుంచుకోండి. అయితే సెలవు దినాలలో బ్యాంకులు బంద్ ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చు. UPI, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సెలవుల వల్ల ప్రభావితం కావు. కాబట్టి బ్యాంక్ సెలవుల సమయంలో కస్టమర్లు ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి, బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, మినీ స్టేట్‌మెంట్ పొందడానికి ATMలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. మీరు ATMలో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ లేదా డిపాజిట్ వంటి సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Narendra Modi: చెడు ఉద్దేశంతో అలా చేయను.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..


Stock Market: వారాంతంలో కూడా భారీ నష్టాలు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి..

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 10 , 2025 | 07:08 PM