Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:16 PM
చాలా మంది మహిళలు పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఖాళీగా ఉంటారు. వారికి తక్కువ ఖర్చుతో ఏదైనా వ్యాపారం చేయాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాలు తెలియదు. ఇలాంటి వారు నిర్వహించుకునే ఒక చక్కని బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత ప్రపంచంలో మారుతున్న కాలంతోపాటు మహిళలు కూడా మారిపోతున్నారు. ఈ క్రమంలో పురుషులతో పోటీ పడి ఉద్యోగాలు చేయడంతోపాటు అనేక వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంటి దగ్గరే ఉండి తక్కువ ఖర్చుతో వ్యాపారం చేయాలని చూస్తున్న మహిళలకు కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. అందుకోసం పాపడ్ తయారీ వ్యాపారం బెస్ట్ అని చెప్పవచ్చు. పాపడ్ తయారీ వ్యాపారం ప్రారంభించడం చాలా ఈజీ కూడా. ఎందుకంటే దీనిని తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో నిర్వహించుకోవచ్చు. మొదట కొంత పెట్టుబడితో చిన్న స్థాయిలో మొదలుపెట్టి, తర్వాత పెద్ద వ్యాపారంగా విస్తరించుకోవచ్చు. దీన్ని ఎలా ప్రారంభించాలి, లాభాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్ సౌకర్యం కూడా..
ఉదాహరణకు మీరు 1 లక్ష రూపాయల ముడి పదార్థాలపై పెట్టుబడి పెట్టితే, మీరు దాదాపు 3 లక్షల రూపాయల విలువైన పాపడ్‌లను ఉత్పత్తి చేసి విక్రయించుకోవచ్చు. అంతేకాదు పాపడ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి రుణం కూడా పొందవచ్చు. ముఖ్యంగా, భారత ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించేందుకు “ప్రధాన్ మంత్రి ముద్ర పథకం” ద్వారా లోన్లను అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా మీరు తక్కువ వడ్డీ రేటుతో రూ. 4 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు.
ఈ వ్యాపారం కోసం ఏం కావాలి..
ఈ వ్యాపారానికి పాపడ్ ముడి పదార్థాలు, అయిల్, ప్యాకేజింగ్ యంత్రాలు అవసరం అవుతాయి. ఈ వ్యాపారాన్ని మీ ఇంట్లో సభ్యులతో కూడా నిర్వహించుకోవచ్చు. అలా చేయడం ద్వారా సిబ్బంది ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత, మీరు వాటిని హోల్‌సేల్ మార్కెట్లో విక్రయించుకోవాలి. అలాగే రిటైల్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సేల్ చేయాల్సి ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనేక మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. కాబట్టి ఈ వ్యాపారానికి అన్ని సీజన్లలో కూడా డిమాండ్ ఉంటుంది.
పాపడ్ తయారీ వ్యాపారం నుంచి లాభాలు
ఈ క్రమంలో మీరు రోజుకు 2 వేల చిన్న 10 రూపాయల ప్యాకెట్లను 40 నుంచి 50 షాపులకు వారి అవసరం, డిమాండ్ మేరకు అందించాల్సి ఉంటుంది. ఇలా మీరు ప్రతి రోజు 2 వేల ప్యాకెట్లను సేల్ చేస్తే ఒక ప్యాకెట్‌పై మీ పెట్టుబడి పోను రూ.5 మిగిలినా కూడా మీకు రోజుకు 10 వేల రూపాయల లాభం వస్తుంది. ఇక నెల ప్రకారం చూస్తే మీకు 3 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీ పెట్టబడి పోను మీకు నెలకు రూ.3 లక్షలు లభిస్తాయి. ఒకవేళ మీరు రోజుకు 4 వేల చిన్న ప్యాకెట్లను సేల్ చేస్తే మీకు 6 లక్షల రూపాయలు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి:
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News