Share News

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

ABN , Publish Date - Mar 23 , 2025 | 02:41 PM

మీరు మంచి లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దీర్ఘకాల వినియోగదారుల కోసం క్రేజీ ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
BSNL 365 Day Recharge Plan

ప్రస్తుతం మన జీవితంలో స్మార్ట్‎ఫోన్‌లు ముఖ్యమైన భాగంగా మారిపోయాయి. ప్రతి రోజు కూడా అనేక విధాలుగా ఉపయోగిస్తూనే ఉంటాం. ప్రధానంగా కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా, షాపింగ్ సహా ఇలా ఎన్నో పనుల కోసం ఉపయోగిస్తున్నాం. ఈ క్రమంలోనే టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది.


వార్షిక ప్లాన్

బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ 365 రోజుల ప్లాన్ ప్రస్తుతం రూ.1999కే అందుబాటులో ఉంది. ఇతర ప్రైవేట్ కంపెనీల ప్లాన్లతో పోలిస్తే, ఈ ప్లాన్ చాలా తక్కువ ధరకు ఉండటం విశేషం. పైగా, ఇది పూర్తి సంవత్సరం పాటు మీ రీఛార్జ్ అవసరాలను తొలగిస్తుంది.

అపరిమిత కాలింగ్

మీరు ఈ ప్లాన్‌ను ఎంచుకున్నట్లయితే తప్పకుండా 365 రోజులపాటు అపరిమిత కాలింగ్ సేవలను ఆస్వాదించవచ్చు. మీరు స్థానిక, STD కాల్స్ చేసే సమయంలో ఎటువంటి చార్జీలను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే, మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో లేదా పని సంబంధిత వారితో ఎలాంటి ఆందోళన లేకుండా మాట్లాడుకోవచ్చు.


ప్రతిరోజూ 100 ఉచిత SMSలు

మీరు పెద్దగా డేటాను ఉపయోగించకపోయినా, SMS సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా మీరు రోజుకు 100 ఉచిత SMSలను పొందవచ్చు. దీంతో ప్రతిరోజూ మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు SMSలను ఎప్పుడైనా పంపించుకోవచ్చు.

600GB డేటా

మీరు ఎక్కువ డేటా వినియోగదారులైతే, ఈ 365-రోజుల ప్లాన్ మీకు సరిపోయే ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో మొత్తం 600GB డేటా అందిస్తున్నారు. ఈ మొత్తం డేటాను 365 రోజులకు విభజించి ఉపయోగించుకోవచ్చు. అంటే, మీరు 1GB డేటా లేదా 2GB డేటా రోజుకు ఉపయోగించుకున్నా, మొత్తంగా మీరు 600GB వరకు వాడుకోవచ్చు.


సమగ్ర సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్ 365-రోజుల ప్లాన్‌కి ఇతర చెల్లింపుల అవసరం లేదు. మీరు ఒకసారి రూ.1999 చెల్లిస్తే, మొత్తం 365 రోజులు ఒకేసారి కనెక్ట్ అయి, అవసరమైన అన్ని సేవలను పొందవచ్చు. ఈ ప్లాన్ వెల వారీగా చూస్తే రూ. 150 పడుతుండగా, రోజుకు మాత్రం రూ. 5 మత్రమే అవుతుంది. ఈ ప్లాన్ అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, మీరు దీనిని రూ.1999లో మాత్రమే పొందవచ్చు. ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చుకుంటే, ఇది చాలా తక్కువ ధరలో లభించడం విశేషం.


ఇవి కూడా చదవండి:

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 02:41 PM