Share News

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:32 PM

సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఉల్లి రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..
Onion Prices

దేశంలో మధ్య తరగతి ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో ఉల్లి ధరలు(Onion Prices) మరింత తగ్గనున్నాయి. ఎందుకంటే ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1, 2025 నుంచి ఉల్లిపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రకటించారు. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBITC) శనివారం సాయంత్రం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉల్లిపై ఎగుమతి సుంకాన్ని "సున్నా"కి తగ్గించడంతో ధరలు మరింత తగ్గుతాయని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.


గత నిర్ణయాలు

2023 డిసెంబర్‌లో దేశంలో ఉల్లి ధరలు సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. దీంతో, దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మరింత పెరిగాయి. అయితే, 2024 మే నెలలో, కేంద్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన ఎగుమతులను నియంత్రించినప్పటికీ, కనీస ఎగుమతి ధరను పెంచారు. ఆ క్రమంలో 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించారు. తర్వాత, 2024 సెప్టెంబర్ నెలలో, కనీస ఎగుమతి ధరను రద్దు చేస్తూ, 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఈ నిర్ణయం, దేశంలో ఉల్లి ధరలను తగ్గించేందుకు, దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగే అవకాశాన్ని కల్పించింది.


ఉల్లి ఎగుమతి

అయినప్పటికీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 17.17 లక్షల టన్నుల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేశారు. మరోవైపు 2024-25 ఆర్థిక సంవత్సరంలో (మార్చి 18 వరకు) 11.65 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతి చేశారు. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్‌లో ఉల్లి ధరలు గత సంవత్సరాల ఇదే కాలం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అఖిల భారత సగటు మోడల్ ధరలు 39 శాతం తగ్గినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో, గత ఒక నెలలో అఖిల భారత సగటు రిటైల్ ధరలు 10 శాతం తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.


ఉల్లి మార్కెట్ మార్పులు

ప్రభుత్వం నిర్ణయాల వల్ల, ఉల్లి మార్కెట్లో అనేక మార్పులు వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి నెల వారీ ఉల్లి ఎగుమతి పరిమాణం 72,000 టన్నుల నుంచి జనవరి 2025 నాటికి 1.85 లక్షల టన్నులకు పెరిగింది. ఈ ఎగుమతి వృద్ధి, ఉల్లి సరఫరాలో ఒక కీలక మార్పును సూచిస్తుంది. రైతులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం, వినియోగదారులకు ధరలు అదుపులో ఉంచడం వంటివి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా మారుతున్నాయి.


రానున్న రోజుల్లో

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, రైతుల పట్ల సానుకూల దృక్కోణాన్ని ప్రతిబింబిస్తుంది. రైతులకు లాభదాయకమైన ధరలతోపాటు, వినియోగదారులకు కూడా ఉల్లి రేట్లు అదుపులో ఉంటాయి. రబీ పంటలు బాగా పండిన క్రమంలో ఈ ధరలు మరింత తగ్గుతాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా రిటైల్ ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువ ఉల్లిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మార్కెట్లో సరైన సరఫరా గమనాన్ని నెలకొల్పి, ప్రతి స్థాయిలోనూ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నిర్ణయం దేశీయ, అంతర్జాతీయ ఉల్లి మార్కెట్‌లను ప్రభావితం చేస్తుంది. సరైన సరఫరా, ధరల నియంత్రణతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది.


ఇవి కూడా చదవండి:

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..


NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 04:33 PM