UPI: యూపీఐ నుంచి త్వరలో ఈ ఫీచర్ బంద్.. ఎందుకో తెలుసా..
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:21 PM
దేశంలో ఓ వైపు డిజిటల్ చెల్లిపులు పెరుగుతున్న క్రమంలో మోసాలు కూడా పెరుగుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో యూపీఐ పుల్ ఫీచర్ తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో మార్పులు తీసుకురావడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పోకస్ చేసింది. ఈ క్రమంలోనే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా జరిగే డిజిటల్ మోసాలను నివారించేందుకు, NPCI పుల్ ఫీచర్ ద్వారా లావాదేవీలను తొలగించే యోచనలో ఉంది. ఈ నిర్ణయం డిజిటల్ మోసాలను తగ్గించడంలో దోహదపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అసలు పుల్ లావాదేవీ అంటే ఏంటి?
UPI సిస్టమ్‌లో పుల్ లావాదేవీ అంటే వ్యాపారులు తమ కస్టమర్లకు చెల్లింపుల కోసం అభ్యర్థనలు పంపించడం. ఈ అభ్యర్థనలో ఇప్పటికే చెల్లించాల్సిన మొత్తం ఎంటర్ చేయబడి ఉంటుంది. ఆ క్రమంలో వినియోగదారుడు తన UPI యాప్‌లో తన పిన్ నంబర్‌ను నమోదు చేసినప్పుడు, ఆ మొత్తం చెల్లింపుగా మారుతుంది. ఇది చాలా సులభమైన, వేగంగా జరిగే చెల్లింపు విధానం.
డిజిటల్ మోసాలు
కానీ పుల్ లావాదేవీ కారణంగా కస్టమర్ స్వయంగా తన UPI యాప్‌లో మొత్తాన్ని ఎంటర్ చేయకుండానే చెల్లింపు ఆమోదం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో పుల్ లావాదేవీల కారణంగా డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ విధానం మోసపూరిత లావాదేవీలను పెంచే ప్రమాదం కలిగిస్తుందని అంటున్నారు. ఉదాహరణకు ఫేక్ కాల్స్, ఫేక్ కస్టమర్ సపోర్ట్ లైన్‌ల ద్వారా వినియోగదారులు ఈ విధంగా మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
పుల్ లావాదేవీల ద్వారా మోసాలు
అంతేకాదు ఇలాంటి మోసాలు ఇటీవల అనేక చోట్ల వెలుగులోకి వచ్చినట్లు గుర్తు చేశారు. ప్రత్యేకంగా మోసపూరిత వ్యక్తులు సులభంగా పుల్ లావాదేవీ ఫీచర్‌ను ఉపయోగించి చెల్లింపులను చేస్తున్నారని వెల్లడించారు. దీనివల్ల, వినియోగదారులు మోసాలకు గురవుతున్నారని, ఈ కారణంగా NPCI ఈ ఫీచర్‌ను తొలగించి, ఈ రకమైన మోసాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
తుది నిర్ణయం మాత్రం..
NPCI ఈ విషయంపై మరింత చర్చలు జరుపుతున్నప్పటికీ, ఈ ఫీచర్‌ను తొలగించాలా లేదా కొనసాగించాలా అన్న విషయంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. బ్యాంకర్లు, వినియోగదారులు, ఇతర రంగాలు ఈ మార్పులను అనేక కోణాలలో చూస్తున్నాయి. కొంతమంది బ్యాంకర్లు ఈ నిర్ణయం వల్ల నిజమైన లావాదేవీలపై కూడా ప్రభావం పడుతుందని, తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిడి పడవచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని NPCI అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీచర్‌ను తొలగించడాన్ని నిజంగా అమలు చేయాలా లేదా అనేది భవిష్యత్తులో నిర్ణయించనున్నారు. ఈ క్రమంలో ఆయా చెల్లింపుల విషయంలో మాత్రం వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బాగా ప్రాచుర్యం
UPI లావాదేవీలు భారతదేశంలో వేగంగా ప్రాచుర్యం పొందాయి. 2023లో 117.7 బిలియన్ల లావాదేవీలలో 46 శాతం పెరుగా, 2024 నాటికి 172.2 బిలియన్లకు చేరుకుంటాయని చెబుతున్నారు. ఫిబ్రవరి 2024 నాటికి, UPI లావాదేవీల సంఖ్య 16 బిలియన్లకు దాటింది. ఈ సంఖ్య అంతరాయం లేకుండా పెరుగుతోంది. ఈ క్రమంలో UPI మన దేశంలో ప్రధానమైన చెల్లింపుల వ్యవస్థగా ఉందని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News