Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
ABN , Publish Date - Mar 25 , 2025 | 04:13 PM
మీరు హోటల్ బుకింగ్ లేదా ఒయో రూమ్స్ వంటి సేవల కోసం ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారా. మీ డేటా దుర్వినియోగానికి గురయ్యే ఛాన్సుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో హోటళ్లు లేదా OYO రూమ్స్ బుకింగ్ ట్రెండ్ క్రమంగా పెరిగిపోయింది. ప్రధానంగా యువత వీటిని ఎక్కవగా ఉపయోగిస్తున్నారు. కానీ వీటి బుకింగ్ విషయంలో ఆధార్ కార్డ్ చూపించడం తప్పనిసరిగా మారింది. కస్టమర్ల భద్రత, వారి గుర్తింపు సమాచారాన్ని నిర్ధారించడానికి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఆధార్ కార్డ్ వివరాలను వారితో పంచుకునే విషయంలో ఓ సురక్షిత విధానం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే మాస్క్డ్ ఆధార్ కార్డ్. దీనిని ఉపయోగించి మీరు మీ ఆధార్ భద్రతను కాపాడుకోవచ్చని అంటున్నారు.
అసలు మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏంటి?
మాస్క్డ్ ఆధార్ కార్డ్ అనేది ఆధార్ కార్డుని డిజిటల్ రూపంలో చూపించే ఒక ఆప్షన్. దీనిలో మీ ఆధార్ నంబర్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన 12 అంకెలు కనిపించకుండా ఉంటాయి. దీనివల్ల, మీ వ్యక్తిగత సమాచారం పబ్లిక్‌గా తెలిసేందుకు అవకాశం ఉండదు.
మాస్క్డ్ ఆధార్ కార్డ్ ప్రయోజనాలు
హోటల్ బుకింగ్ లేదా OYO రూమ్స్ బుక్ చేసుకునే సమయంలో మీరు మీ ఆధార్ కార్డు సమాచారాన్ని పంచుకుంటారు. మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఉపయోగించడం వల్ల, మీ డేటా సురక్షితంగా ఉంచుకోవడానికి ఛాన్సుంది. మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఉపయోగించడం వల్ల మీ పూర్తి ఆధార్ నంబర్ పబ్లిక్‌గా కనిపించదు. అందువల్ల మోసపూరిత చర్యలు జరగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మాస్క్డ్ ఆధార్ కార్డును డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయడం చాలా సులభం. ఇది, హోటల్ బుకింగ్ లేదా OYO వంటి సేవలను మరింత సులభతరం చేస్తుంది
మాస్క్డ్ ఆధార్ కార్డ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
మీరు మాస్క్డ్ ఆధార్ కార్డు పొందటానికి, ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను https://uidai.gov.in/ సందర్శించాలి
ఆ తర్వాత ‘మై ఆధార్’ ఆప్షన్ క్లిక్ చేయండి..
ఆ క్రమంలో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి
ఆ సమయంలో వచ్చిన OTP (One Time Password) నమోదు చేయండి
OTP ద్వారా ధృవీకరణ పూర్తైన తర్వాత మీరు మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి
డౌన్‌లోడ్ ఆప్షన్‌లో "మాస్క్డ్ ఆధార్" ను ఎంచుకోండి. దీంతో మీ ఆధార్ నంబర్ చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి.
పాస్‌వర్డ్ సెట్ చేయడం: మాస్క్డ్ ఆధార్ PDF ఫైల్‌ని ఓపెన్ చేయడానికి, మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, పుట్టిన సంవత్సరం (DOB) కనెక్ట్ చేసి పాస్‌వర్డ్‌ని సెట్ చేసుకోండి. ఉదాహరణకు, పేరు SHARAD, పుట్టిన సంవత్సరం 1998 అయితే, పాస్‌వర్డ్ "SHARA1998" ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News