Share News

TDS Limit: అద్దె చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై రూ.6 లక్షల వరకు నో ట్యాక్స్..

ABN , Publish Date - Apr 01 , 2025 | 03:32 PM

నేటి నుంచి మొదలైన కొత్త ఆర్థిక సంవత్సరంలో పలు రకాల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వాటిలో టీడీఎస్ కూడా ఒకటి. ఇకపై అద్దె విషయంలో దీని వార్షిక పరిమితి ఏకంగా రూ. 6 లక్షలకు పెరిగింది. దీంతో అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది.

TDS Limit: అద్దె చెల్లింపుదారులకు గుడ్ న్యూస్..ఇకపై రూ.6 లక్షల వరకు నో ట్యాక్స్..
TDS on Rent

దేశంలో నేటి (ఏప్రిల్ 1, 2025) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ క్రమంలో అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి వచ్చాయి. వీటిలో ఒకటి అద్దెపై TDS (Tax Deducted at Source) పరిమితి 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచిన విధానం కూడా ఉంది. అయితే దీని ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది, ఎవరికి ఎక్కువ ఉపయోగం. అసలు టీడీఎస్ అంటే ఏంటనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


TDS అంటే ఏంటి..

TDS (Tax Deducted at Source) అనేది ఒక ఆదాయపు పన్ను. ఇది వివిధ ఆదాయ వనరులపై వర్తిస్తుంది. ఉదాహరణకు జీతం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పెట్టుబడులపై వచ్చిన వడ్డీ వంటి ఆదాయాలపై ప్రభుత్వం TDS రూపంలో పన్ను వసూలు చేస్తుంది. అయితే ఇది ప్రతి ఆదాయ వనరుకు వర్తించదు. శాలరీ, రెంట్, బ్రోకరేజీ, కమీషన్ లాంటి ఫీజుల చెల్లింపుల విషయంలో కూడా దీనిని అమలు చేస్తారు. ఇది అద్దె చెల్లించేవారు ఆ అద్దె మొత్తానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని ముందుగా ప్రభుత్వానికి చెల్లించడం. అద్దె చెల్లించిన వ్యక్తి లేదా సంస్థ, అద్దె తీసుకున్న వ్యక్తికి బిల్లును జారీ చేసి, TDS మొత్తాన్ని కట్ చేస్తుంది.


పెద్ద సంస్థలు

ప్రస్తుతం అద్దె మీద TDSను 2.4 లక్షల నుంచి 6 లక్షల వరకు పరిమితిని పెంచారు. ఇది ప్రధానంగా చాలా మంది ఇంటి ఓనర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచడం వల్ల ఎక్కువ అద్దె చెల్లించే వ్యక్తులు, ఆస్తి యజమానులు, పలు కంపెనీలు కూడా ప్రయోజనం పొందుతాయి. ముఖ్యంగా పెద్ద సంస్థలు అద్దె ఇచ్చే వారు, ఈ మార్పు ద్వారా వారి పన్ను బాధ్యతను సులభతరం చేసుకోవచ్చు. వారు TDSను ముందుగా చెల్లించి, ఆ మొత్తాన్ని తమ చెల్లింపులలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇదే సమయంలో అద్దెని తరచుగా మార్చేవారు లేదా పెద్ద ఆస్తి ఓనర్లు తమ అభ్యర్థనలను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంటుంది.


కేంద్ర మంత్రి ప్రకటన..

సాధారణంగా ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కానీ, టీడీఎస్ (టాక్స్ డెడక్షన్ అట్ సోర్స్) నిబంధనల ప్రకారం, కొన్ని చెల్లింపులపై ఆదాయ పన్ను ముందుగానే వసూలు చేస్తారు. అంతేకాదు మీరు ముందుగానే చెల్లించిన టీడీఎస్ మొత్తాన్ని, చివరగా చెల్లించాల్సిన పన్ను మొత్తంలో సర్దుబాటు చేసుకోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ఫిబ్రవరి 2025 బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన ఈ ప్రతిపాదన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం పెద్ద మొత్తాలలో అద్దె చెల్లించే వ్యక్తులు, ఆస్తి యజమానులకు, చిన్న వ్యాపారులకు కూడా ఉపయోగపడనుంది.


ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక


Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..


Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 01 , 2025 | 04:16 PM