Share News

Global Startup Ecosystem: స్టార్టప్ ర్యాంకింగ్‌లో ఇండియా ఎక్కడ..దేశంలో ఈ నగరమే టాప్..

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:52 PM

భారతదేశంలో అద్భుతమైన స్టార్టప్ వ్యవస్థ కలిగి ఉందని మరోసారి తేలింది. ఎందుకంటే తాజాగా ప్రపంచ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ విధానంలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలిచిందని ఓ నివేదిక తెలిపింది. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Global Startup Ecosystem: స్టార్టప్ ర్యాంకింగ్‌లో ఇండియా ఎక్కడ..దేశంలో ఈ నగరమే టాప్..
lobal Startup Ecosystem

ప్రపంచ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ గురించి తాజాగా స్టార్టప్ డేటాబేస్ సంస్థ ట్రాక్స్న్ ఓ నివేదికను ప్రకటించింది. ఈ నివేదికలో అమెరికా, యూకేల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2025 మొదటి త్రైమాసికంలో భారతదేశం 2.5 బిలియన్ డాలర్ల నిధులను (రూ.2,14,15,17,50,000) సమకూర్చుకుంది. ఈ క్రమంలోనే తన వృద్ధిని పెంచుకుని మూడో ప్లేస్ చేరుకుంది. ఇదే సమయంలో దేశంలో పలు కీలక మార్పులు కూడా వచ్చాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.


ఇదే టాప్ సిటీ

దేశంలోని ఇతర నగరాలను అధిగమించి ఈ త్రైమాసికంలో సమీకరించిన నిధుల పరంగా ఢిల్లీ మొదటి స్థానం సాధించింది. బెంగళూరు, ఒప్పందాల పరంగా అధికంగా నమోదయినా, ఢిల్లీ మాత్రం IPO (ప్రారంభ ప్రజాస్వామ్య ఇష్యూలు) ద్వారా అధిక నిధులను సమీకరించింది. దీంతో ఢిల్లీ ప్రస్తుతం భారతదేశం మొత్తం స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అత్యధిక నిధులను దక్కించుకున్న సిటీగా నిలిచింది. ఢిల్లీకి చెందిన అనేక టెక్ సంస్థలు దేశంలోని మొత్తం టెక్ నిధులలో 40% వాటాను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత బెంగళూరు 21.64% నిధులను సమీకరించింది. ఆ తర్వాత స్థానాల్లో ముంబయి, హైదరాబాద్ ఉన్నట్లు తెలుస్తోంది.


చివరి దశలో పెట్టుబడులు

భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా నిలిచిందని ట్రాక్స్న్ సహ వ్యవస్థాపకురాలు నేహా సింగ్ అన్నారు. ఈ వ్యవస్థలో విలువైన యునికార్న్ కంపెనీలు (బిలియన్ డాలర్లతో పైగా ఉన్న కంపెనీలు), చివరి దశలో ఉన్న కంపెనీల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఈ క్రమంలో భారతదేశం ఇప్పుడు మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌ జాబితాలో చేరినట్లు తెలిపారు. ట్రాక్స్న్ నివేదిక ప్రకారం ప్రస్తుతం స్టార్టప్ కంపెనీలకు ప్రారంభ దశలో పెట్టుబడులు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. అయితే, చివరి దశలో పెట్టుబడులు పెరిగాయి. ఈ మార్పు 2024లో ఉత్సాహభరితమైన ఐపిఓ మార్కెట్ తర్వాత ఆయా కంపెనీల బలమైన పైప్‌లైన్‌ను సూచిస్తుంది. 2024లో అనేక వెంచర్ బ్యాక్డ్ కంపెనీలు పబ్లిక్‌గా వచ్చాయి.


ఈ రంగంలో ఎక్కువ పెట్టుబడులు

భారతదేశంలో ప్రస్తుతం అత్యధికంగా పెట్టుబడులు పొందుతున్న రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం. ఈ రంగంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల కంటే అప్లికేషన్‌లపై ఎక్కువగా ఫోకస్ చేశారు. కొన్ని టెక్ కంపెనీలు ఈ రంగంలో ప్రగతి సాధించాయి. ఉదాహరణకు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటివి విజయవంతంగా కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఈ రంగంలో మరికొన్ని సంస్థలు కూడా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో భారతదేశంలో కంపెనీల విలీనాల ప్రక్రియ కూడా పెరిగింది. మొదటి త్రైమాసికంలో 38 ఒప్పందాలు జరుగగా, ఇది ఏడాది సమయంలో వృద్ధి 41% ఉన్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా స్టార్టప్ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి పబ్లిక్ మార్కెట్‌కి చేరుకుంటున్నాయి.


ఇవి కూడా చదవండి:

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి


Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:53 PM