Indian Rupee: రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్..పెరిగిన రూపాయి విలువ
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:49 PM
దాదాపు రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. ఈ క్రమంలోనే అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత రెండు సంవత్సరాల తర్వాత అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి తాజాగా బలపడింది. 2025 మార్చి నెలలో బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, రూపాయి 86.37 వద్ద ముగిసిన తర్వాత, 39 పైసల పెరుగుదలతో 85.98 వద్ద ముగిసింది. వరుసగా ఎనిమిది రోజుల పాటు రూపాయి లాభపడుతూ, ఈ వారం ఉత్తమ స్థాయి లాభాలను నమోదు చేయడం విశేషం.
జనవరి 2023 తర్వాత రూపాయి ఈ వారపు లాభాల్లో అత్యుత్తమంగా నమోదైంది. డాలర్ ఇండెక్స్ పతనం నేపథ్యంలో మార్చిలో ఇప్పటివరకు రూపాయి 1.78 శాతం పెరిగింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే మాత్రం, రూపాయి విలువ 2.8 శాతం తగ్గింది.
రూపాయి బలపడటానికి గల కారణాలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారంలో FPI (విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల) నికర కొనుగోళ్లు పెరగడం కూడా ఓ కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఫెడ్ రేట్ల విషయంలో కూడా ఎలాంటి పెరుగుదల లేకపోవడం, డాలర్ తగ్గడంతో రూపాయి విలువ పెరిగింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు కూడా రెండో రోజు వరుసగా పెరిగాయి.
డబ్ల్యుటీఐ ముడి చమురు ధర 0.19 శాతం పెరిగి 67.94 డాలర్ల వద్ద నమోదైంది. ఈ సమయంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, స్థిరమైన FII ఇన్‌ఫ్లోల కారణంగా రూపాయి బలపడింది. డాలర్ బలహీనత నేపథ్యంలో మార్కెట్ లో రూపాయి మదుపరులకు ఆశాజనకమైన పరిణామాలను అందించింది. ఈ క్రమంలో రూపాయి వచ్చే కొన్ని వారాలలో 86.00-86.80 శ్రేణి మధ్య ట్రేడవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విదేశీ కరెన్సీలతో పోలిస్తే..
సమీప కాలంలో రూపాయి 86.00 నుంచి 86.80 మధ్య ట్రేడవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ, రూపాయి 85.80 స్థాయికి చేరే అవకాశమున్నట్లు వెల్లడించారు. డాలర్ ఇండెక్స్, ఇది ప్రపంచంలోని విదేశీ కరెన్సీలతో పోలిస్తే యుఎస్ డాలర్ విలువను కొలిచే సూచిక 0.16 శాతం పెరిగి 104.01కి చేరుకుంది. మార్చిలో డాలర్ ఇండెక్స్ 3.4 శాతం బలహీనపడింది. ఇది నవంబర్ 2022 తర్వాత అత్యధికంగా పతనమైంది. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణ సమస్యలు పెరిగిన నేపథ్యంలో, డాలర్ ఇండెక్స్ తిరిగి 104.13 వద్ద చేరవచ్చని అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి:
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Read More Business News and Latest Telugu News