Jumped Deposit Scam: ఈ స్కామ్ విషయంలో జాగ్రత్త.. అకౌంట్లో డబ్బులు పడ్డాయని సంబరపడితే..
ABN , Publish Date - Jan 11 , 2025 | 08:00 AM
అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్న జాగ్రత్తలు తీసుకుని, ఎంతగా అవగాహన పెంచుతున్నా.. మోసగాళ్లు కొత్త కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు.
రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు కొత్త కొత్త స్కామ్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంక్‌కి వెళ్లే పని తప్పింది. అందరూ మొబైల్స్ ద్వారానే ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకుంటున్నారు. దీంతో సైబర్ నేరాలు (Cyber Crime) కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఎన్న జాగ్రత్తలు తీసుకుని, ఎంతగా అవగాహన పెంచుతున్నా.. మోసగాళ్లు కొత్త కొత్త రూట్లు కనిపెట్టి వినియోగదారులను దోచుకుంటున్నారు. తాజాగా జంప్డ్ డిపాజిట్ స్కామ్ (Jumped Deposit Scam) వెలుగులోకి వచ్చింది.
జంప్డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో ఇటీవల సైబర్ నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు. ఇటీవల ఇలాంటి మోసాల బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటీ జంప్డ్ డిపాజిట్ స్కామ్.? ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏంటి..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్‌ల వరకు డిజిటల్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తుండడంతో పేటీఎమ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ చెకింగ్ కూడా యూపీఐ ద్వారానే చేస్తున్నారు. దీనినే కేటుగాళ్లు అస్త్రంగా చేసుకుంటున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి యూపీఐ ద్వారా కొంత మొత్తంలో డబ్బులు పంపిస్తారు. మీకు మెసేజ్ రాగానే డబ్బులు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు యూపీఐ యాప్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తారు.
బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్ లింక్‌లను పంపించి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేస్తున్నారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేసి పేమెంట్స్ చెక్ చేసుకోవడానికి ప్రయత్నించారో మీ ఖాతా మొత్తం ఖాళీ అయిపోతుంది. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఈ జంప్‌డ్ డిపాజిట్ స్కామ్ గురించి అవగాహన కల్పించే ఒక వీడియోను షేర్ చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..