Share News

Microsoft India : ఉద్యోగాల తీసివేతలు ఉండవు

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:24 AM

భారత్‌లోని తన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఇండియా చల్లటి కబురు చెప్పింది.

Microsoft India : ఉద్యోగాల తీసివేతలు ఉండవు

  • మైక్రోసాఫ్ట్‌ ఇండియా

న్యూఢిల్లీ: భారత్‌లోని తన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ ఇండియా చల్లటి కబురు చెప్పింది. ఈ సంవత్సరం భారత్‌లో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించే ఆలోచన లేదని మైక్రోసాఫ్ట్‌ ఇండియా, సౌత్‌ ఆసియా ప్రెసిడెంట్‌ పునీత్‌ చందోక్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసా్‌ఫ్టకు 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 20,000 మంది భారత్‌లో ఉన్నారు. పనితీరు ఆధారంగా తన మొత్తం ఉద్యోగుల్లో ఒక శాతం మందిని తీసివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్రభావం భారత్‌లోని ఉద్యోగులపైనా పడుతుందని భయపడ్డారు. అయితే అదేమీ లేదని మెక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రకటించడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కృత్రిమ మేథ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోసం మరింత మంది ఉద్యోగులను నియమించుకుంటామని పునీత్‌ చెప్పడం విశేషం.

Updated Date - Jan 13 , 2025 | 02:24 AM