Share News

Nita Ambani: 60 ఏళ్లలో తన ఫిట్‌నెస్ రహస్యాలను తెలిపిన నీతా అంబానీ..

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:45 PM

నేడు (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (60) మహిళలకు కీలక సూచనలు చేశారు. దీంతోపాటు 60 ఏళ్ల వయస్సులో తన ఫిట్‌నెస్ రహస్యం సిక్రెట్స్ పంచుకున్నారు.

Nita Ambani: 60 ఏళ్లలో తన ఫిట్‌నెస్ రహస్యాలను తెలిపిన నీతా అంబానీ..
Nita Ambani

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8న) సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (60) (Nita Ambani) తన ఫిట్‌నెస్ రహస్యం గురించి కీలక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అన్ని రకాల వయసుల మహిళలు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. దీంతో పాటు తన వ్యాయామ దినచర్య వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వీడియోలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని ఆమె చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో 60 ఏళ్ల నీతా అంబానీ 60 కిలోల బరువులతో డే వర్కౌట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.


ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యం

తన ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యం చేస్తున్నానని, దీంతోపాటు అదనంగా వ్యాయామం కూడా చేస్తున్నట్లు నీతా అంబానీ చెప్పారు. ఈ క్రమంలో వారానికి 5 నుంచి 6 రోజులు వ్యాయామం చేస్తానన్నారు. ఫ్లెక్సిబిలిటీ, యోగా, కోర్ స్ట్రెంగ్త్ వ్యాయామాలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 50, 60లలో మహిళలు ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని వెల్లడించారు. 30 ఏళ్ల తర్వాత మహిళలు దశాబ్దానికి 3 నుంచి 8% కండర ద్రవ్యరాశిని కోల్పోతారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వయస్సు పెరిగే కొద్దీ ఈ నష్టం జరుగుతుందన్నారు. అందుకే ఇప్పటినుంచే మన శరీరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


వ్యాయామంతో అనేక ప్రయోజనాలు

దీంతోపాటు కాలక్రమేణా ఓర్పు, జీవక్రియ కూడా తగ్గతుందన్నారు. అందుకే మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ప్రతి రోజు కూడా పోషక ఆహారాలతోపాటు వ్యాయామంపై కూడా ఫోకస్ చేయాలని సూచించారు. ఇలా క్రమంగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నియంత్రించుకోవడంలో సహాయపడుతుందని నీతా అంబానీ అన్నారు. దీంతోపాటు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందన్నారు. వ్యాయామం ద్వారా గుండె కండరాలు బలపడి, రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు.


చురుగ్గా, సంతోషంగా..

ఇలా ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా కండరాలు, ఎముకలు బలపడతాయన్నారు నీతా అంబానీ. వారి శక్తి స్థాయిలు పెరిగి, స్టామినా కూడా పెరుగుతుందన్నారు. దీంతోపాటు వ్యాయామం మానసిక ఆరోగ్యాన్ని కూడా బలపరుస్తుందని, ఆందోళన తగ్గుతుందన్నారు. రోజు వ్యాయామం చేయడం ద్వారా రోజంతా చురుగ్గా, సంతోషంగా ఉండేందుకు అవకాశం ఉందని నీతా అంబానీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

H 1B Visa: హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఫీజు, గడువు వివరాలివే..


Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 08 , 2025 | 04:21 PM