Ratan Tata: రతన్ టాటా యంగ్ ఫ్రెండ్ శంతను నాయుడికి టాటా మోటార్స్‌లో కీలక పదవి
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:07 PM
భారతీయ వ్యాపార రంగంలో రతన్ టాటా పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అయితే రతన్‌తో చివరి వరకు సన్నిహితంగా ఉన్న యువకుడు శంతను నాయుడికి టాటా గ్రూప్‌లో కీలక పదవి లభించింది.

టాటా గ్రూప్‌లో రతన్ టాటాకు (Ratan Tata) చివరి వరకు నమ్మకమైన కేర్ టేకర్, మేనేజర్‌గా వ్యవహరించిన యువకుడు శంతను నాయుడుకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌లో కీలక పదవి దక్కింది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ వేదికగా స్వయంగా నాయుడు ప్రకటించారు. "టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్, హెడ్ - స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌గా నేను ఒక కొత్త పదవిని ప్రారంభిస్తున్నాను" అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కొత్త పదవి శంతను నాయుడుకు, వ్యక్తిగతంగా కూడా ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు.
కంపెనీతో సంబంధం..
తన పోస్ట్ లో ఆయన ఇంకా ఇలా పేర్కొన్నారు. “నా తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, తెల్లటి చొక్కా, నేవీ ప్యాంటుతో నడుస్తూ వచ్చేవారు. ఆ క్రమంలో నేను విండోలో ఎదురుచూసే వాడినని గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ రోజు పూర్తిగా మారిపోయిందన్నారు. ఈ భావోద్వేగపూరిత క్షణం ద్వారా, టాటా మోటార్స్‌తో తన కుటుంబానికి ఉన్న సంబంధాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో రతన్ టాటా వ్యవస్థాపించిన మొబిలిటీకి సంబంధించి చిత్రంతో ఉన్న టాటా నానో కారు ఫోటో కూడా ఆయన పోస్ట్‌లో జత చేశారు.
వ్యాపారానికి మించిన అనుబంధం
ఇక శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి దక్కడంతో అనేక మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు టాటా మోటార్స్‌లో ఈ ఉత్తేజకరమైన నాయకత్వ పాత్రను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో శంతను నాయుడుకు, టాటా గ్రూప్‌తో ఉన్న సంబంధం వృత్తిపరమైన సంబంధాలకంటే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. టాటా మోటార్స్, టాటా గ్రూప్ నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక పదవులతో ఉన్న అనుబంధం మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా రతన్ టాటాతో ఆయనకు చాలా మంచి సంబంధం ఉంది.
రతన్ టాటా మరణం..
రతన్ టాటా తన వీలునామాలో శంతను నాయుడి పేరును ప్రస్తావించి, వారి సన్నిహిత బంధాన్ని మరింత నిరూపించారు. రతన్ టాటా నాయుడుకు విద్యా రుణాలను మాఫీ చేసి, అతని సహచర స్టార్టప్ గుడ్‌ఫెలోస్‌లో తన వాటాను వదులుకున్నారు. ఇది కూడా టాటా, నాయుడి మధ్య ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. 2024, అక్టోబర్ 9న టాటా మోటార్స్ సంస్థకు పనిచేసిన రతన్ టాటా 86 ఏళ్ల వయస్సులో మరణించారు. రతన్ టాటా మరణం తరువాత, శంతను నాయుడు సోషల్ మీడియాలో భావోద్వేగ పూరిత పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News