Share News

Stock Market : ఇండెక్స్‌ షేర్లపై సెబీ నిఘా

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:33 AM

ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ ఉన్న షేర్ల లావాదేవీలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ నిశితంగా గమనిస్తోంది.

Stock Market : ఇండెక్స్‌ షేర్లపై సెబీ నిఘా

న్యూఢిల్లీ: ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ ఉన్న షేర్ల లావాదేవీలను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ నిశితంగా గమనిస్తోంది. క్యాష్‌ సెగ్మెంట్‌లో ఎవరైనా ఈ షేర్లలో అక్రమాలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకునేందుకు ఈ నిఘా పెట్టినట్టు సెబీ హోల్‌టైమ్‌ సభ్యుడు అనంత నారాయణ్‌ చెప్పారు. క్యాష్‌ మార్కెట్లో ఎవరైనా ఈ షేర్లలో అక్రమాలకు పాల్పడితే అది మార్కెట్‌ ఆటుపోట్లకు దారితీసి, ఆ ప్రభావం డెరివేటివ్‌ మార్కెట్‌పైనా పడుతుందన్నారు. హెడ్జింగ్‌ లేదా అధిక లాభాల కోసం, క్యాష్‌ అండ్‌ డెరివేటివ్స్‌ మార్కెట్లో బెట్స్‌ తీసుకోవడం అసాధరణం కాకపోయినా ఆ పేరుతో ‘పంప్‌ అండ్‌ డంప్‌’ కార్యకలాపాలపై మాత్రం నిఘా ఉంచినట్టు నారాయణ్‌ చెప్పారు.

Updated Date - Jan 13 , 2025 | 02:33 AM