Share News

Stock Market: దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:02 AM

భారత స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి కొంత ఒడిదుడుకులు కొనసాగినప్పటికీ ఆ తర్వాత నుంచి ఏకబిగిన మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ బాగుండడంతో అన్ని ఇండెక్స్ లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

Stock Market: దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
Stock Market

భారత స్టాక్‌ మార్కెట్‌లు భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి కొంత ఒడిదుడుకులు కొనసాగినప్పటికీ ఆ తర్వాత నుంచి ఏకబిగిన మార్కెట్లు భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్ సెంటిమెంట్ బాగుండడంతో అన్ని ఇండెక్స్ లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.

ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 763 పాయింట్లు పుంజుకొని 77,678 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 284 పాయింట్లు ఎగబాకి 23,589 దగ్గర కొనసాగుతోంది. ప్రారంభంలో సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. గత నాలుగు రోజులుగా రూపాయి బలోపేతం అవుతుండడంతో రాబోయే రోజుల్లో కొనుగోళ్లు కొనసాగుతాయనే అభిప్రాయం ఇన్వెస్టర్లలో బలంగా ఉండటమే దీనికి కారణం కావొచ్చు. అటు, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ. 85.90 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి:

ఫార్మా కింగ్‌ దివీస్‌ మురళి

TDP vs YSRCP: వైసీపీకి టీడీపీ సరికొత్త సవాల్ టార్గెట్ అదేనా

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 24 , 2025 | 11:32 AM