Share News

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:57 PM

బిలియనీర్ హర్ష్ గోయెంకా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అవును సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అసలు ఏం జరిగింది. ఎందుకు భావోద్వేగానికి లోనయ్యారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక
harsh goenka post viral

అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన హృదయాలను కదిలిస్తాయి. భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చేలా చేస్తాయి. అచ్చం అలాంటి ఒక హృదయాన్ని హత్తుకునే కథని RPG ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియా X వేదికగా పంచుకున్నారు. తరచుగా ఆసక్తికరమైన విషయాలను పంచుకునే ఆయన..ఈ కథతో అనేక మందిని కదిలించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం. ఈసారి ఆయన పంచుకున్న కథ భారత వైమానిక దళ మాజీ వింగ్ కమాండర్ అశోక్ కేట్కర్‌ది. ఐదు సంవత్సరాల తర్వాత తన కుమార్తెతో కలిసిన అశోక్ కేట్కర్ జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన ఇది.


తండ్రిని కాదని

ముంబై విమానాశ్రయంలో వీల్‌చైర్‌లో ఉన్న వింగ్ కమాండర్ అశోక్ కేట్కర్ ఢిల్లీకి విమానం ఎక్కాడు. అతను సర్వీసులో ఉన్నప్పుడు అతని రెండు కాళ్లను కోల్పోయాడు. కానీ బాధకరమైన విషయం ఏమిటంటే, అతని కుమార్తె భార్గవితో విడిపోవడం. భార్గవి తన తండ్రిని కాదని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఐదేళ్ల పాటు ఒకరికొకరు కలుసుకోలే, మాట్లాడుకోలేదు. కానీ అశోక్ కేట్కర్ విమానం ఎక్కిన కొద్ది సేపటికి ఒక ప్రత్యేక సంఘటన జరిగింది.


ఇద్దరు ఒకరినొకరు

ఆ క్రమంలో అశోక్‌ని యుద్ధ వీరుడు అని పిలిచి, "సార్, మీ నుంచి దూరంగా ఉంటున్న మీ కుమార్తె భార్గవి ఈ విమానాన్ని నడుపుతోందని ఓ చిన్నారి అన్నాడు. ఇది విన్న అశోక్ ఆశ్చర్యపోయాడు. కొద్ది సేపటి తర్వాత ఆయనకు వెంటనే కన్నీళ్లు వచ్చాయి. ఆ క్షణంలో ఆయన కుమార్తె భార్గవి కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి తన తండ్రికి నమస్కరించి, "నాన్న, మీ కలను నేను నిజం చేశాను" అని చెప్పింది. నేను ఇప్పుడు పైలట్‌నని, ఆ క్రమంలో తండ్రి పాదాలపై పడి, దయచేసి నన్ను క్షమించమని కోరింది. ఈ మాటలు చెప్పిన తరువాత, ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వారి కళ్లలోను, మనసుల్లోనూ కన్నీళ్ళు నిండిపోయాయి. ఇది చూసిన విమానంలోని ప్రయాణికులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రీకూతుళ్ల పునఃకలయికను చూసి వారందరూ సంతోషపడ్డారు. అయితే యుద్ధవీరుడని పిలిచింది మరెవరో కాదు, అతని మనవడే కావడం విశేషం.


గంటల్లోనే వైరల్

విమానం దిగగానే అశోక్ కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందాడు. తన నుంచి విడిపోయిన కుమార్తె తిరిగి వారితో చేరింది. ఇది నిజంగా హృదయ విదారక సంఘటన అని చెబుతూ గోయెంకా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇది చదివిన ఓ నెటిజన్ సూపర్ అని పేర్కొన్నాడు. మరొకరు ఈ కథ చాలా అందంగా ఉందన్నారు. ఒక వ్యక్తి "ఇది నిజమేనా?" అని సందేహం వ్యక్తం చేశాడు. మరొకరు ఇది చాలా మంచి కథ అని, డైరెక్టర్ మణిరత్నంకు తెలిస్తే సినిమా తీస్తాడని పేర్కొన్నారు.

tweet.jpg


ఇవి కూడా చదవండి:

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..


Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..


New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 29 , 2025 | 07:56 PM