Stock Market: లాభాలతో స్వాగతం.. న్యూ ఇయర్ రోజున సూచీలకు లాభాల జోష్..
ABN , Publish Date - Jan 01 , 2025 | 03:54 PM
గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు నూతన సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. డిసెంబర్ వాహనాల సేల్స్‌లో పెరుగుదల నమోదు కావడంతో ఆటోమొబైల్ రంగం లాభాలు ఆర్జించింది. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా మదుపర్లు ఆశావహంతో ఉన్నారు.
గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ సూచీలు నూతన సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. డిసెంబర్ వాహనాల సేల్స్‌లో పెరుగుదల నమోదు కావడంతో ఆటోమొబైల్ రంగం లాభాలు ఆర్జించింది. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్‌పై కూడా మదుపర్లు ఆశావహంతో ఉన్నారు. దీంతో వరుస నష్టాలను ఎదుర్కొన్న దేశీయ సూచీలు బుధవారం లాభాల జోష్‌ను కొనసాగించాయి. సెన్సెక్స్ 368 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ బాటలోనే నిఫ్టీ కూడా లాభాలు ఆర్జించింది. (Business News).
మంగళవారం ముగింపు (78, 139)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 120 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. దాదాపు 240 పాయింట్లు కోల్పోయి 77, 898 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్ కోలుకుంది. ఇంట్రాడే కనిష్టం నుంచి 850 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 368 పాయింట్ల లాభంతో 78, 507 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. చివరకు 98 పాయింట్ల లాభంతో 23, 742 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్‌లో ఎస్‌జేవీఎన్, ఐఆర్బీ ఇన్‌ఫ్రా, ముత్తూట్ ఫైనాన్స్, మారుతీ సుజికీ షేర్లు లాభాలు అందుకున్నాయి. సీజీ కన్స్యూమర్, కాన్‌ఫిన్ హోమ్స్, పేటీఎమ్, ప్రెస్టీజ్ ఎస్టేట్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 251 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.64గా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..