Share News

Stock Market: ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 10:04 AM

ఈ నెలలో విడుదల కాబోతున్న మూడో త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారుల ధోరణిపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ అర్థిక సంవత్సరం బడ్జెట్ గురించి వస్తున్న వార్తలపై కూడా చాలా మంది భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

Stock Market: ఒడిదుడుకుల్లో దేశీయ సూచీలు.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

గత వారం చెప్పుకోదగ్గ లాభాలు అందించిన దేశీయ సూచీలు సోమవారం కాస్త ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నెలలో విడుదల కాబోతున్న మూడో త్రైమాసిక ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారుల ధోరణిపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాభాలతో ప్రారంభమైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ అర్థిక సంవత్సరం బడ్జెట్ గురించి వస్తున్న వార్తలపై కూడా చాలా మంది భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. (Business News).


శుక్రవారం ముగింపు (79, 223)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 58 పాయింట్ల స్వల్ప లాభంతో మొదలైన సెన్సెక్స్ క్షణాల్లోనే మరింత లాభాల్లోకి దూసుకెళ్లింది. ఏకంగా 300 పాయింట్లకు పైగా లాభపడి 79, 532 వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత క్రమంగా నష్టాలోకి జారుకుంది. 500 పాయింట్లకు పైగా కోల్పోయి 79, 004 వద్ద కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం పది గంటల సమయంలో 98 పాయింట్ల లాభంతో 79, 321 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం పది గంటల సమయంలో 4 పాయింట్ల స్వల్ప లాభంతో 24, 006 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో జుబిలెంట్ ఫుడ్స్, నైకా, ఏంజెల్ వన్, సీజీ కన్స్యూమర్ షేర్లు లాభాలు అందుకున్నాయి. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 283 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 281 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.82గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 06 , 2025 | 10:04 AM