Share News

Stock Market: కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ABN , Publish Date - Jan 15 , 2025 | 10:32 AM

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో పాటు మదుపర్లు కొనుగోళ్లపై దృష్టి పెట్టడంతో సూచీలు మంగళవారం లాభాలను ఆర్జించాయి. బుధవారం కూడా అదే ధోరణిలో సాగుతున్నాయి.

Stock Market: కొనసాగుతున్న లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
Stock Market

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో పాటు మదుపర్లు కొనుగోళ్లపై దృష్టి పెట్టడంతో సూచీలు మంగళవారం లాభాలను ఆర్జించాయి. బుధవారం కూడా అదే ధోరణిలో సాగుతున్నాయి. ఇండెక్స్‌లో హెవీ వెయిట్ షేర్లు లాభపడుతుండడం సూచీలపై సానుకూల ప్రభావం చూపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల బాటలో సాగుతున్నాయి (Business News).


మంగళవారం ముగింపు (76, 499)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం 400 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ స్థిరంగా కొనసాగుతోంది. 400 పాయింట్లకు పైగా లాభపడి 76, 901వ గరిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం ఉదయం 10: 30 గంటల సమయంలో 310 పాయింట్ల లాభంతో 76, 809 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే లాభాలతో రోజును ప్రారంభించింది. ప్రస్తుతం ఉదయం 10:30 గంటల సమయంలో 62 పాయింట్ల లాభంతో 23, 238 వద్ద కొనసాగుతోంది.


సెన్సెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, బీఎస్‌ఈ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. లారస్ ల్యాబ్స్, సీజీ పవర్, కల్యాణ్ జువెల్లర్, బజాజ్ ఫిన్‌సెర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 255 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 167 పాయింట్ల లాభంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.53గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 15 , 2025 | 10:32 AM