Portable AC: తక్కువ ధరకే పోర్టబుల్ ఏసీ.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 06:28 PM
Portable AC: వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగ భగలకు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు జనాలు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Portable AC: వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగ భగలకు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు జనాలు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాన్స్, కూలర్స్, ఏసీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఏసీలను వినియోగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. ప్రజలు ముందుగానే అలర్ట్ అవుతున్నారు. ఏసీలు కొనేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే, సొంత ఇళ్లు ఉన్నవారికి ఏసీ ఇన్‌స్టాలేషన్ పెద్దగా ఇబ్బంది కలిగించదు. కానీ, అద్దె ఇళ్లలో ఉండేవారు ఏసీ కొనుగోలు చేయాలంటే కాస్త ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే.. ఇన్‌స్టాలేషన్ ఇబ్బందిగా పరిణమిస్తుంది. అందుకే.. కూలర్స్, పోర్టబుల్ ఏసీ కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటారు. సాధారణంగా ఏసీల్లో విండో ఏసీ, స్ప్లిట్ ఏసీ అని ఉంటాయి. అద్దె ఇళ్లలో వీటిని అమర్చుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే.. ఈ ఏసీలను ఇన్‌స్టాల్ చేయాలంటే గోడలకు రంద్రాలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఇంటి ఓనర్లు అంగీకరించరు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో పోర్టబుల్ ఏసీలు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వీటి ఇన్‌స్టాలేషన్ కూడా చాలా ఈజీ.
పోర్టబుల్ ఏసీలను గదిలో ఎక్కడైనా ఏర్పాటు చేయగల కాంపాక్ట్, మొబైల్ కూలింగ్ ఎక్విప్‌మెంట్. ఈ ఏసీకి సంప్రదాయ విండో, స్ప్లిట్ ఏసీల మాదిరిగా శాశ్వత ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. పోర్టబుల్ ఏసీలలో వేడి గాలిని బయటకు పంపడానికి కిటికీకి జతచేసిన ఎగ్జాస్ట్ గొట్టం ఉంటుంది. అద్దె ఇళ్లకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి గోడను పగలగొట్టాల్సిన అవసరం లేదు.
పోర్టబుల్ ఏసీ ప్రయోజనాలు..
పోర్టబుల్ ACని ఇన్‌స్టాల్ చేయడానికి విండో, పవర్ సాకెట్ మాత్రమే అవసరం. కిటికీ నుంచి ఎగ్జాస్ట్ గొట్టాన్ని బయటకు ఏర్పాటు చేయొచ్చు. ఇక వాటికి ఉన్న చక్రాలు, హ్యాండిల్స్.. ఏసీని ఒక చోట నుంచి మరొక చోటకు సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. అందుకే.. ఈ పోర్టబుల్ ఏసీ అద్దె ఇళ్లకు ఉపయుక్తంగా ఉంటుంది.
Also Read:
ఉపరాష్ట్రపతికి ఇందిర ఉదంతం గుర్తుచేసిన కపిల్
గుడ్‌న్యూస్.. TASLలో ఉద్యోగాలు..
For More Business News and Telugu News..