BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:26 PM
టెలికాం మార్కెట్లో క్రమంగా పోటీ పెరిగింది. దీంతో యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక కంపెనీలు పోటాపోటీగా రీఛార్జ్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇదే సమయంలో ఇటివల రూ. 200 బడ్జెట్‌లోపు ప్రకటించిన ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన నేపథ్యంలో అనేక మంది ప్రత్యామ్నాయ బడ్జెట్ ప్లాన్‌లవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఇటివల ప్రవేశపెట్టిన రూ. 200 బడ్జెట్‌లోపు ప్రవేశపెట్టిన రీఛార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రూ. 197 రీఛార్జ్ ప్లాన్, 70 రోజుల చెల్లుబాటు
BSNL ప్రకటించిన రూ. 197 ప్లాన్ 70 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో మొదటి 18 రోజులు అపరిమిత కాలింగ్, 2GB రోజువారీ డేటా లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 100 ఉచిత SMSలు కూడా లభిస్తాయి. ఈ క్రమంలో ఎక్కువ రోజులు ఫోన్ కాల్స్ ఉపయోగించే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు. కానీ మొత్తం వ్యవధికి అపరిమిత కాలింగ్ లేదా డేటా మాత్రం ఉండదు.
BSNL రూ. 199 రీఛార్జ్ ప్లాన్
ఇక మరో రెండు రూపాయలు యాడ్ చేయడం ద్వారా రూ. 199 ప్లాన్ లభిస్తుంది. దీనిలో 30 రోజుల పాటు వినియోగదారులు అపరిమిత కాలింగ్, రోజు 2 జీబీ డేటా ప్రయోజనాలను పొందుతారు. దీంతోపాటు రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. నెల మొత్తం నిరంతర అపరిమిత కాలింగ్, డేటాను కోరుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ మంచి ఎంపికగా ఉంటుంది.
మీరు ఏ BSNL ప్లాన్‌ను ఎంచుకోవాలి?
మీరు ఎక్కువ కాల వ్యవధి రీఛార్జ్ ప్లాన్ ఇష్టపడితే పరిమిత ఉచిత కాలింగ్, డేటా ప్రయోజనాల రూ. 197 ప్లాన్ మీకు సరైనదని చెప్పవచ్చు. అయితే మీరు పూర్తి 30 రోజుల పాటు అపరిమిత కాలింగ్, డేటా సౌకర్యాలను కోరుకుంటే మాత్రం రూ. 199 ప్లాన్ బెస్ట్. ఈ ప్లాన్‌లు వినియోగదారులకు సరసమైన ధరలో మంచి సేవలను అందిస్తున్నాయి. తద్వారా వారు తమ అవసరాలకు అనుగుణంగా సరైన ప్లాన్ ఎంచుకోవచ్చు. BSNL ఈ కొత్త ప్లాన్‌లతోపాటు అనేక రకాల ఇతర ప్లాన్లను కూడా అందిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Swiggy: ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..
Toyota: టయోటా నుంచి మార్కెట్లోకి కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
H 1B Visa: హెచ్1బీ వీసా రిజిస్ట్రేషన్స్ ప్రారంభం.. ఫీజు, గడువు వివరాలివే..
Alert: ఏప్రిల్ 1 నుంచి టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కీలక మార్పులు..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News