Upcoming IPOs: ఇన్వెస్టర్లకు అలర్ట్..వచ్చే వారం రానున్న ఐపీఓలు ఇవే..
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:14 PM
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ వచ్చేసింది. అయితే ఈసారి మార్చి 31 నుంచి మొదలయ్యే వారంలో ఎన్ని ఐపీఓలు రాబోతున్నాయి. ఎన్ని కంపెనీలు లిస్ట్ కానున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. మార్చి 31, 2025 నుంచి ఏప్రిల్ 4, 2025 మధ్య, కొన్ని ఆసక్తికరమైన ఐపీఓలు రానున్నాయి. ఇప్పటికే పలు ఐపీఓలు సిద్ధంగా ఉండగా, మరికొన్ని సంస్థలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీంతోపాటు ఇదే సమయంలో మరికొన్ని సంస్థలు కూడా లిస్ట్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వచ్చే వారం రానున్న కొత్త ఐపీఓలు:
భారతి హెక్సాకామ్ IPO
సబ్‌స్క్రిప్షన్ టైం: ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5, 2025
ధర శ్రేణి: రూ.542 నుంచి రూ. 570 ప్రతి షేర్
ఆఫర్ పరిమాణం: రూ. 4,275 కోట్ల (7.5 కోట్ల షేర్ల పూర్తి ఆఫర్-ఫర్-సేల్)
ప్రొమోటర్: భారతి ఎయిర్‌టెల్ 70% వాటా కలిగి ఉంది. మిగతా 30% టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా వద్ద ఉంది.
లిస్టింగ్: ఏప్రిల్ 12, 2025న BSE, NSEలో అంచనా
రెటాగియో ఇండస్ట్రీస్ ఐపీఓ (Retaggio Industries IPO)
రెటాగియో ఇండస్ట్రీస్ ఐపీఓ మార్చి 27, 2025 మొదలు కాగా, ఏప్రిల్ 1, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఐపీఓ BSE SME సెక్టార్‌లో లిస్టింగ్ చేయబడుతుంది. SME మార్కెట్ ద్వారా ఇన్వెస్టర్లు ఈ సంస్థలతో తమ పెట్టుబడులను భాగస్వామ్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది చిన్న స్థాయి వ్యాపారాలకు పెద్ద స్థాయి మార్కెట్‌లో స్థానం సంపాదించుకునేందుకు ఛాన్స్ ఇస్తుంది.
ఆటెన్ పేపర్స్ అండ్ ఫోమ్ ఐపీఓ (Aten Papers and Foam IPO)
ఆటెన్ పేపర్స్ అండ్ ఫోమ్ ఐపీఓ 2025 మార్చి 28 ప్రారంభం కాగా, ఏప్రిల్ 2 వరకు ఉంటుంది. ఇది పేపర్, ఫోమ్ ఉత్పత్తుల విభాగంలో తన స్థానాన్నినిలబెట్టుకునేందుకు, మంచి ఆదాయం సంపాధించేందుకు అవకాశం ఉంది. SME మార్కెట్‌లో ఇది ఒక ఆసక్తికరమైన ఐపీఓ కావచ్చు.
స్పినరూ కమర్షియల్ ఐపీఓ (Spinaroo Commercial IPO)
స్పినరూ కమర్షియల్ ఐపీఓ మార్చి 28న మొదలు కాగా, ఏప్రిల్ 3 వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ ప్రధానంగా కమర్షియల్ రంగంలో తన పనితీరును చూపిస్తుంది. ఆర్ధిక విభాగంలో కొత్త మార్పులను విస్తరించేందుకు ఇది ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు. మార్చి 31న రంజాన్ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు.
SME IPOలు సబ్‌స్క్రిప్షన్ ముగింపు
రేడియోవాల్లా నెట్‌వర్క్ IPO: ఏప్రిల్ 2న ముగుస్తుంది
TAC ఇన్ఫోసెక్ IPO: ఏప్రిల్ 2న ముగుస్తుంది
యాష్ ఆప్టిక్స్ & లెన్స్ IPO: ఏప్రిల్ 3న ముగుస్తుంది
జయ్ కైలాష్ నమ్‌కీన్ IPO: ఏప్రిల్ 3న ముగుస్తుంది
K2 ఇన్‌ఫ్రాజెన్ IPO: ఏప్రిల్ 3న ముగుస్తుంది
అలువిండ్ ఆర్కిటెక్చరల్ IPO: ఏప్రిల్ 4న ముగుస్తుంది
క్రియేటివ్ గ్రాఫిక్స్ సొల్యూషన్స్ ఇండియా IPO: ఏప్రిల్ 4న ముగుస్తుంది
అనేక SME కంపెనీలు
మరోవైపు గతంలో సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ పూర్తైన అనేక SME కంపెనీలు ఈ వారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి. ఈ IPO లిస్టింగ్‌లలో ఈ కంపెనీలు ఉన్నాయి.
డెస్కో ఇన్‌ఫ్రాటెక్ (BSE SME) - ఏప్రిల్ 1, 2025న లిస్టింగ్
శ్రీ అహింసా నేచురల్స్ (NSE SME) - ఏప్రిల్ 2, 2025న లిస్టింగ్
ATC ఎనర్జీస్ (NSE SME) - ఏప్రిల్ 2, 2025న లిస్టింగ్
Identixweb (BSE SME) - ఏప్రిల్ 3, 2025న లిస్టింగ్
వీటిలో మీరు ఆసక్తి కలిగిన ఐపీఓలను ఎంచుకుని నిర్ణయం తీసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు పెట్టుబడి పెట్టే ముందు, స్టాక్ మార్కెట్ తీరు, ఆయా సంస్థల గురించి తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. SME ఐపీఓలతో పాటు మరిన్ని మెయిన్‌బోర్డ్ ఐపీఓలు కూడా రానున్న రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి ఐపీఓలో కూడా కొంత రిస్క్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Read More Business News and Latest Telugu News

కొత్త ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా గురించి తెలుసా..

శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా

ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన 7 ప్రధాన బ్యాంకింగ్ రూల్స్

ఏప్రిల్‌లో పర్సనల్ లోన్స్‌పై ప్రధాన బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు
