Share News

Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:33 PM

కొంత మంది డబ్బు కోసం ఏదైనా చేస్తారు. మరికొంత మంది డబ్బు సంపాదించాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఓ భారతీయ సంతతి వ్యాపారవేత్త వినయ్ హిరేమత్ మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Vinay Hiremath

ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు తమ దగ్గర డబ్బు లేని కారణంగా ఏమీ చేయలేకపోతున్నామని చెబుతుంటారు. కానీ అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతికి చెందిన వినయ్ హిరేమత్ (Vinay Hiremath) మాత్రం అందుకు వినూత్నంగా ఓ ప్రకటన చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిలియనీర్ అయిన తర్వాత కూడా వినయ్ అభద్రతా భావంతో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వేల కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు.


చాలా డబ్బు ఉందని

ఆన్‌లైన్ ఉచిత స్క్రీన్ రికార్డింగ్ సాధనాలను అందించే లూమ్ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమత్ 2023లో తన స్టార్టప్ లూమ్‌ను 975 మిలియన్ డాలర్లకు (రూ. 8368.59 కోట్లు) విక్రయించారు. అప్పటి నుంచి తనకు ఏం చేయాలో తోచడం లేదన్నారు. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. ఇప్పుడు తన వద్ద చాలా డబ్బు ఉందని, కానీ తన జీవితంలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కంపెనీని అమ్మిన తర్వాత డబ్బు సంపాదించాలన్నా, హోదా సాధించాలన్నా కోరిక లేకుండా పోయిందన్నారు.


తర్వాత రోజుల్లో..

వినయ్ హిరేమత్ 1991లో జన్మించాడు. ఆయన యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్, ఉర్బానా-ఛాంపెయిన్‌లో చదువు ప్రారంభించాడు. కానీ రెండేళ్ల తర్వాత చదువు మానేశాడు. దీని తర్వాత ఆయన కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోకు వెళ్లాడు. స్టార్టప్‌లలో కెరీర్‌ను కొనసాగించాలని కలలు కన్నాడు. మొదట్లో వినయ్ సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ అయిన బ్యాక్‌ప్లేన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.

ఆ సమయంలో ఇంటర్న్‌గా ఉన్న షాహెద్ ఖాన్‌ను కలుసుకున్నాడు. తరువాత అతనితో కలిసి లూమ్‌ను స్థాపించాడు. ప్రారంభ రోజులలో లూమ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కేవలం రెండు వారాల్లో నిధులు ఖాళీ అయ్యాయి. ఈ కష్ట సమయాల్లో హిరేమత్ తన క్రెడిట్ కార్డును పూర్తిగా ఉపయోగించుకుని కంపెనీని కాపాడుకున్నాడు. లూమ్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CTOగా ఆయన $200 మిలియన్ల నిధిని సేకరించాడు.


రెండు వారాల పాటు

ఆ క్రమంలోనే ఆయన నాయకత్వంలో లూమ్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లు దాటింది. ఆ తర్వాత 2023లో లూమ్‌ను విక్రయించారు. స్టార్టప్ అమ్మిన తర్వాత 'రెడ్ వుడ్స్ 'కి వెళ్లి మళ్లీ ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించాడు. కానీ డజన్ల కొద్దీ పెట్టుబడిదారులు, రోబోటిక్ నిపుణులను రెండు వారాల పాటు కలుసుకున్నప్పటికీ, ఆయన వారిని ఆకర్షించడంలో విఫలమయ్యాడు. ఆ తరువాత అతను ఎటువంటి అనుభవం లేకుండా హిమాలయాలను అధిరోహించడానికి బయలుదేరాడు. చివరకు అనారోగ్యంతో తిరిగి వచ్చాడు.

తర్వాత వినయ్ హవాయికి వెళ్లాడు. ఇప్పుడు ఫిజిక్స్ చదువుతున్నాడు. వాస్తవ ప్రపంచానికి సంబంధించిన విషయాలను సృష్టించే కంపెనీని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సంస్థ లూమ్ స్థాయికి చేరకపోయినా.. తనకు ఆత్మస్థైర్యాన్ని అందించాలని, ఇదే తన కోరిక అని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..


Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Piyush Goyal: ఈవీలకు సబ్సిడీలు అవసరం లేదు.. వారే స్వయంగా చెప్పారు


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 06 , 2025 | 04:35 PM