Indian Railway: జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగిలో ఎక్కారా.. ఇలా చేస్తే భారీ జరిమానా నుంచి తప్పించుకోవచ్చు
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:48 PM
జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్‌లో ఎక్కుతూ ఫైన్ చెల్లిస్తున్నారా.. స్క్వాడ్‌కు దొరికి ఇబ్బందులు పడుతున్నారా.. అత్యవసర సమయంలో రైలు ప్రయాణం చెయ్యాల్సినప్పుడు రిజర్వేషన్ చేయించుకోవడం సాధ్యం కాదు. అలాంటప్పుడు జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ కోచ్ ఎక్కినా భారీ జరిమానా నుంచి ఎలా తప్పించుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్లానింగ్ లేకుండా అత్యవసరంగా రైలులో ప్రయాణం చేయాలంటే జనరల్ టికెట్ తీసుకుని రైలు ఎక్కడం ఒకటే మార్గం. సాధారణంగా ఒక ప్యాసింజర్ రైలుకు జనరల్ బోగీలు తక్కువుగా ఉంటాయి. గరిష్టంగా నాలుగు లేదా ఐదుకు మించి ఉండవు. ప్రయాణీకులు మాత్రం వేలల్లో ఉంటారు. దీంతో అత్యవసరంగా రైలులో వెళ్లే ప్రయాణీకులు జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగిల్లో ఎక్కేస్తుంటారు. కొన్నిసార్లు స్క్వాడ్ పట్టుకుంటే భారీగానే జరిమానా విధిస్తారు. సాధారణంగా చాలామంది జనరల్ టికెట్స్‌తో రిజర్వేషన్ కోచ్‌లలో ఎక్కి టీటీఈలకు ఎంతోకొంత చేతిలోపెడదామనే ఆలోచనతో ఉంటారు. ఇలా చేసిన సందర్భాల్లో కూడా ఎప్పుడైనా స్వ్కాడ్‌కు దొరికితే అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో మన దగ్గర జనరల్ టికెట్ ఉన్నప్పటికీ అదనపు జరిమానా చెల్లించకుండా కేవలం జనరల్ టికెట్ ధరకు, రిజర్వేషన్ టికెట్ ధరకు మధ్య ఉన్న తేడా రుసుము చెల్లిస్తే సరిపోతుంది. అదేలా... ఏ సందర్భాల్లో ఇలాంట సదుపాయం అందుబాటులో ఉంటుందో తెలుసుకుందాం.
కోచ్‌లో బెర్తులు ఖాళీగా ఉంటే
రైలులోని రిజర్వేషన్ కోచ్‌లలో బెర్తులు అన్ని సందర్భాల్లో ఫుల్ కావు. కొన్నిసార్లు బెర్తులు ఖాళీగా ఉంటాయి. ఈ విషయం మనకు ముందుగా తెలియదు. కేవలం రైల్వే అధికారులు లేదా విధుల్లో ఉన్న టీటీఈలకు మాత్రమే ఏ రైలులో బెర్తులు ఖాళీగా ఉన్నాయో తెలుస్తుంది. అందుకే మనం జనరల్ టికెట్‌తో రిజర్వేషన్ బోగిలో ఎక్కేటప్పుడు ముందుగానే టీటీఈని సంప్రదించాలి. పలానా స్టేషన్ వరకు తాను ప్రయాణించాల్సి ఉందని, జనరల్ టికెట్ తీసుకున్నానని ఏవైనా బెర్తులు ఈరైలులో ఖాళీలు ఉన్నాయా అని అడగాలి. తన దగ్గరుండే చార్ట్ చూసి రైలులో ఖాళీలు ఉంటే ఏ కోచ్‌లో ఏ బెర్తులో కూర్చోవాలో చెబుతారు. ఖాళీ లేకపోతే లేవని చెప్పేస్తారు. రైలులో బెర్తులు ఖాళీ ఉన్నాయని టీటీఈ చెబితే మన నుంచి అదనపు జరిమానా రుసుము వసూలు చేయరు. కేవలం రిజర్వేషన్ టికెట్‌కు జనరల్ టికెట్‌కు మధ్య డిఫరెంట్ ఛార్జీ మాత్రమే వసూలు చేసి ఒక రశీదుతో పాటు బెర్తు నెంబర్ కేటాయిస్తారు. ఇలాంటి సందర్భాల్లో స్క్వాడ్ చెక్ చేసినా జరిమానా వసూలు చేయరు.
డిఫరెంట్ ఛార్జి ఎలా లెక్కిస్తారు
ఉదాహరణకు ఒక రైలులో స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ టికెట్ ధర రూ.400 అయితే.. జనరల్ టికట్ ధర రూ.180 అయితే స్లీపర్ క్లాచ్ రిజర్వేష్ కోచ్‌లో ఎక్కినందుకు రూ.220 చెల్లిస్తే సరిపోతుంది. అలాకాకుండా టీటీఈని అడగకుండా నేరుగా రిజర్వేషన్ కోచ్‌లో ఎక్కితే జరిమానా వేసే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి...
Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే
Harish Rao Big Relief: హరీష్‌రావుకు భారీ ఊరట.. కేసు కొట్టివేత
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here