Share News

Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి

ABN , Publish Date - Mar 18 , 2025 | 08:50 PM

క్రెడిట్ కార్డులు అనేక మందికి కష్ట కాలంలో ఉపయోగపడతాయి. కానీ ఇవే క్రెడిట్ కార్డులు మరికొంత మందిని కష్టాల్లో పడేస్తాయి. అయితే పలువురు క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించిన తర్వాత కూడా వారి సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అయితే అందుకు ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి
credit card bill

ప్రస్తుతం అనేక మంది ఉద్యోగులు కూడా క్రెడిట్ కార్డ్ వినియోగిస్తుంటారు. ఏది కొనుగోలు చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా కూడా క్రెడిట్ కార్డ్ తెగ వాడేస్తుంటారు. కానీ నెల చివరకు వచ్చే బిల్లులను చూసి షాక్ అవుతుంటారు. ఆ క్రమంలో ఆయా బిల్లులను సమయానికి చెల్లించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆలస్యం చేస్తే మాత్రం ఆ మొత్తంపై వడ్డీల మీద వడ్డీ పడుతుంది. ఆ క్రమంలో మీరు చెల్లించడం విషయంలో మరికొన్ని నెలలు ఆలస్యం చేస్తే ఆ మొత్తం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది.


కొంత మాత్రమే

ఇలాంటి సందర్భాలలో అనేక మంది కూడా పెరిగిన బిల్లులు చెల్లించలేక సెటిల్ మెంట్ కోసం ఆసక్తి చూపిస్తారు. అయితే సెటిల్ మెంట్ చేసుకునే విషయంలో మాత్రం ఓ సారి ఆలోచించాలని నిపుణులు చెబుతుంటారు. రుణ గ్రహీత ఏకమొత్త రుణ పరిష్కారానికి అంగీకరించకూడదు. ఎందుకంటే ఆ మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని కట్టాలని చెబుతారు. మీరు దానికి ఒప్పుకుని పాటిస్తే, ఇది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది.


లోన్ తీసుకోవాలన్నా

ఈ నిర్ణయం మీకు అప్పుల నుంచి విముక్తి కలిగించవచ్చు. కానీ మీ క్రెడిట్ నివేదికలో మాత్రం 'సెటిల్డ్' అనే గుర్తు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. ఇది మీకు దీర్ఘకాలంలో క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం కనిపిస్తుంది. ఆ క్రమంలో మీరు ఏదైనా లోన్ తీసుకోవాలన్నా కూడా కష్టమవుతుంది. క్రెడిట్ స్కోరు సరిగా లేకపోవడం వల్ల మీకు కొత్త రుణం లభించదు. రుణం చెల్లించడంలో విఫలమైన చాలా సంవత్సరాల తర్వాత కూడా, రుణం చాలా ఎక్కువ వడ్డీ రేటుకు లభిస్తుంది.


మీ సిబిల్ స్కోర్

ఒకవేళ మీరు భవిష్యత్తులో ఎలాంటి లోన్స్ అవసరం లేదనుకున్న వారు సెటిల్ మెంట్ చేసుకోవచ్చు. కానీ పలు సందర్భాలలో క్రెడిట్ కార్డ్ లేదా లోన్ సెటిల్ మెంట్ల విషయంలో మొత్తం చెల్లింపులు చేసినా కూడా మీ సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే పలు బ్యాంకులు లేదా ఆయా సంస్థలు ఆయా బిల్లులపై జరిమానాలు కట్టలేదని, మొత్తం చెల్లించలేదని రిమార్క్ చూపించి రిపోర్ట్ పంపిస్తారు. అది కూడా మీ క్రిడెట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రమంలో చెల్లింపు చేసిన బిల్లు పత్రాలతోపాటు పూర్తి సమాచారాన్ని సిబిల్ కేంద్రానికి లేదా ఆర్బీఐ సంబంధిత కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయాలి. అలా చేయడం ద్వారా మీ సిబిల్ స్కోర్ పెంచుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 18 , 2025 | 08:50 PM