Share News

రూ.1.50 లక్షలకు పసికందు విక్రయం

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:14 PM

ఓ విద్యార్థినికి జన్మించిన ఐదు రోజుల పసికందును రూ.1.50 లక్షలకు విక్రయించిన వ్యవహారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. అయితే.. ఈ వ్యవహారం మొత్తంలో కీలకంగా వ్యవహారించిన సిద్ధవైద్యురాలిని అరెస్టు చేసినట్లు కడలూరు జిల్లా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

రూ.1.50 లక్షలకు పసికందు విక్రయం

- సిద్ధవైద్యురాలి అరెస్ట్‌

చెన్నై: వివాహేతర సంబంధం ద్వారా ఓ విద్యార్థినికి జన్మించిన ఐదు రోజుల పసికందును రూ.1.50 లక్షలకు విక్రయించిన వ్యవహారంలో సిద్ధవైద్యురాలిని అరెస్టు చేసినట్లు కడలూరు(Kadaluru) జిల్లా పోలీసులు తెలిపారు. జిల్లాలోని చిదంబరం కామరాజర్‌ నగర్‌కు చెందిన ఓ దంపతులకు 15 ఏళ్ళుగా సంతానం లేకపోవడంతో, వారు ఓ శిశువును దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం పలువురు వైద్యులు, మిత్రులను ఆ దంపతులు ఆశ్రయించారు.

ఈ వార్తను కూడా చదవండి: Dy CM: వారిని ప్రోత్సహించడమే మా లక్ష్యం..


ఈ నేపథ్యంలో గత వారం ఆ దంపతుల ఇంట్లో ఉన్న ఓ పసికందును చూసి అనుమానించిన స్థానికులు వెంటనే జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కడలూరు పిల్లల సంరక్షణ విభాగం అధికారి చిత్రావతి తన బృందంతో సంబంధిత ఇంటికి వెళ్ళి విచారించారు. సంతానం లేనందువల్ల వడలూరులోని ఓ సిద్ధ వైద్యురాలి వద్ద ఐదురోజుల క్రితం జన్మించిన పసికందును రూ.1.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.


అనంతరం వైద్యురాలిని అరెస్టు చేసి విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి. వడలూరు ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థినికి ఓ యువకుడితో ఏర్పడిన వివాహేతర సంబంధం కారణంగా ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత సంబంధిత దంపతుల నుండి స్వాధీనం చేసుకున్న పసికందును స్థానిక పిల్లల సంరక్షణా కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

Singareni: సింగరేణి ఉపకార వేతనం

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2025 | 12:14 PM