Share News

Hyderabad: దారుణం.. తండ్రిని చంపిన తనయుడు

ABN , Publish Date - Mar 26 , 2025 | 08:59 AM

కన్నకొడుకే తండ్రిని కడతేర్చిన విషయం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. క్షణికావేశంలో కన్న తండ్రి అనే విచక్షణను కోల్పోయి హత్యచేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: దారుణం.. తండ్రిని చంపిన తనయుడు

- గొంతు నులిమి హత్య

- పోలీసుల అదుపులో కుమారుడు, భార్య లక్ష్మి

హైదరాబాద్: కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో కన్న తండ్రి అనే విచక్షణను కోల్పోయి హత్యచేశాడో కుమారుడు. నెల రోజుల వ్యవధిలో ఈ స్టేషన్‌ పరిధిలో ఇదే తరహాలో రెండో హత్య జరగడం గమనార్హం. కుషాయిగూడ పోలీసుల(Kushaiguda Police) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్‌ అల్లీకూర్‌ తండాకు చెందిన పత్లావత్‌ శంకర్‌(54) భార్యా పిల్లలతో కొన్నాళ్ల క్రితం కుషాయుగూడకు వలస వచ్చి స్థానిక సాయునగర్‌లో నివాసం ఉంటున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: MLA Raja Singh: మరో సంచలనానికి తెరలేపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. విషయం ఏంటంటే..


ఆటో నడుపుతూ జీవనం సాగించే ఇతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీకి ఇద్దరు కుమార్తెలు కాగా, రెండవ భార్య కుమారుడు జగదీష్‌(24). రెండో భార్య జగదీష్‌ చిన్నతనంలోనే భర్త శంకర్‌ను వదిలివెళ్లింది. అప్పటి నుంచి పినతల్లి లక్ష్మీ వద్దనే పెరిగిన జగదీష్‌ రోజువారి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జగదీష్‏కు వివాహమైన కొద్ది రోజులకే ఇతడి ప్రవర్తన నచ్చక భార్య వెళ్లిపోయింది. తాగుడుకు బానిసైన తండ్రి శంకర్‌, కొడుకు జగదీష్‏లు ఇద్దరూ నిత్యం గొడవపడుతుండే వారు. దీంతో జగదీష్‌ వేరుగా ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. అయితే, శంకర్‌ తాగిన మైకంలో భార్య లక్ష్మీతో కూడా ఘర్షణ పడుతూ నిత్యం వేధించేవాడు.


city4.2.jpg

ఈ వేధింపులు ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం లక్ష్మీ, జగదీశ్‌ కలిసి శంకర్‌పై ఫిర్యాదు చేయడానికి కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు వారికి సర్దిచెప్పి పంపారు. అనంతరం సోమవారం రాత్రి కూడా భార్యతో శంకర్‌ గొడవపడడంతో ఆమె కుమార్తె ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత తండ్రీ కొడుకులు ఇద్దరూ మద్యం మత్తులో ఘర్షణ పడి పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కారు. పోలీసులు ఇద్దరినీ మందలించి శంకర్‌ సెల్‌ఫోన్‌ తీసుకుని ఉదయం రండి అని పంపించేశారు. రాత్రి 1.30గంటల సమయంలో జగదీష్‌ తన స్నేహితుడితో కలిసి వెళ్లి శంకర్‌ను నిద్రలేపారు. జగదీష్‌ అదే పనిగా తలుపులు బాదుతుండడంతో శంకర్‌ ఆవేశంతో కారం పొడిని జగదీ్‌షపై చల్లే ప్రయత్నం చేశాడు.


దీంతో ఆగ్రహించిన జగదీష్‌ తండ్రి శంకర్‌ను గట్టిగా పట్టుకుని గొంతుపై చేయివేసి నలిపాడు. అక్కడే ఉన్న స్నేహితుడు ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే అక్కడికి సమీపంలో ఉన్న మరో స్నేహితుడికి విషయం తెలిపి తీసుకునిరాగా అప్పటికే శంకర్‌ మృతిచెంది ఉన్నాడు.

జగదీష్‌ స్నేహితులు, చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు జగదీష్‌, లక్ష్మీ, జగదీష్‌ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తండ్రి నిత్యం పినతల్లి లక్ష్మిని వేధించడం వల్లే హతమార్చినట్లు జగదీష్‌ పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..

మిస్‌ వరల్డ్‌ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు

త్వరలో ఎకో టూరిజం పాలసీ

డ్రగ్స్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2025 | 08:59 AM