Share News

అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jan 16 , 2025 | 02:00 PM

తాము పెంచుకునే పశువులను స్నానం చేయించేందుకు తీసుకెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. కనుమ పండుగ రోజున రైతులు తాము పెంచుకుంటున్న పశువులకు స్నానాలు చేయించి, అలంకరించి పూజలు చేస్తారు.

అయ్యోపాపం ఎంత ఘోరం జరిగిందో.. విషయం ఏంటంటే..

- కనుమ పండుగ రోజు విషాదం.. నీటిగుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

చెన్నై: తాము పెంచుకునే పశువులను స్నానం చేయించేందుకు తీసుకెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటమునిగి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. కనుమ పండుగ రోజున రైతులు తాము పెంచుకుంటున్న పశువులకు స్నానాలు చేయించి, అలంకరించి పూజలు చేస్తారు. ఈ నేపథ్యంలో, సేలం జిల్లా రాకిపట్టి గ్రామానికి చెందిన శంకర్‌ కుమార్తె శ్రీకవి (14), అదే ప్రాంతానికి చెందిన మహేష్ కుమార్‌(Mahesh Kumar) కుమారుడు ప్రదీప్ రాజా (9) తమ పశువులను తీసుకొని సమీపంలో కుంట వద్దకు వెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: పండుగ పూట విషాదం.. నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి


nani1.jpgవారితో పాటు శ్రీకవి తాత రాజేంద్రన్‌ కూడా ఉన్నాడు. గుంటలో పశువులను స్నానం చేస్తున్న శ్రీకవి, ప్రదీ్‌పరాజా హఠాత్తుగా కాలుజారి నీటిలో పడిపోయారు. అది చూసి తాత రాజేంద్రన్‌(Rajendran) కేకలతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని గుంటలో గాలించి ఇద్దరి మృతదేహాలు వెలికితీశారు. కనుమ పండుగ రోజున ఇద్దరు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 02:00 PM