Share News

Shankar: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ నివాసంలో బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:43 PM

యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ ఇంటిపై గుర్తతెలియని దుండగులు బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం సృష్టించారు. ఈ విషయం స్థానికంగా సంచలనానికి దారితీసింది. దాదాపు యాభై మంది వ్యక్తులు వచ్చి నానా బీభత్సం సృష్టించారు.

Shankar: యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌ నివాసంలో బురద, పేడ చల్లి దుండగుల బీభత్సం

చెన్నై: నగరంలోని యూట్యూబర్‌ సవుక్కు శంకర్‌(YouTuber Savukku Shankar) నివాసంలో సోమవారం ఉదయం కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికుల వేషాల్లో చొరబడిన కొంతమంది బురద, పేడనీళ్లు చల్లి నానాబీభత్సం సృష్టించారు. సవుక్కు శంకర్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం సుమారు 50 మంది ఉదయం 9.30 గంటలకు ఆ ఇంటిలో చొరబడ్డారు. ఆసమయంలో ఆయన తల్లి మాత్రమే ఇంటిలో ఒంటరిగా ఉన్నారు. దుండగులు పడకగది, వంటగదిలో బురదనీళ్లను, పేడనీళ్లను చల్లి వస్తువులను చెల్లాచెదురుగా పడవేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: తీరానికి కొట్టుకొచ్చిన వింత వస్తువు..


కొన్ని వస్తువులను నేలకేసి పగులగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న సవుక్కు శంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లేలోగా దుండగులు పారిపోయారు. సవుక్కుశంకర్‌ ఇటీవల యూట్యూబ్‌లో పారిశుధ్య కార్మికులను కించపరిచేలా విమర్శలు చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌ కావడంతో కార్మికులు తీవ్ర నిరసన కూడాప్రకటించారు.


ఆ నేపథ్యంలో సవుక్కు శంకర్‌ తన ఇంటిపై పారిశుధ్య కార్మికులే దాడి చేసి, గదుల నిండా బురద చల్లారని అన్నారు. ఈదాడి వెనుక నగర పోలీసుకమిషనర్‌ ప్రమేయం ఉందని ఆరోపించారు. బీభత్సానికి పాల్పడినవారంతా అక్కడికి వెళ్లిన పాత్రికేయులను కూడా బెదిరించి తరిమికొట్టారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వేర్వేరు ప్రకటనలో నిరసన వ్యక్తం చేశారు.


సవుక్కు శంకర్‌ నివాసంలో బురదను చల్లినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ సంఘటన వెనుక సూత్రధారులను కూడా అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తమిళగవెట్రి కళగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ కూడా సవుక్కుశంకర్‌ నివాసంలో జరిగిన బీభత్సాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం

ఎంఎంటీఎస్‌లో అత్యాచార యత్నం

న్యాయవాది దారుణ హత్య

పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2025 | 01:43 PM