Share News

పండుగ పూట విషాదం.. నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:38 PM

నదిలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి నీటి ఉదృతి పెరగడంతో నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన తంజావూరు(Tanjavuru)లో చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా మేలట్టూరు గ్రామానికి చెందిన సౌందరరాజన్‌ (39) తిరుప్పూర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.

పండుగ పూట విషాదం.. నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

చెన్నై: నదిలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి నీటి ఉదృతి పెరగడంతో నీటిలో కొట్టుకుపోయి మృతిచెందిన ఘటన తంజావూరు(Tanjavuru)లో చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా మేలట్టూరు గ్రామానికి చెందిన సౌందరరాజన్‌ (39) తిరుప్పూర్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. పండుగ సందర్భంగా తన భార్య శరణ్య సొంతూరు తంజావూరుకు తన కుమార్తెలు నితీషా(12), నివేద(14)తో కలిసి గత ఆదివారం వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి సౌందరరాజన్‌(Soundararajan) పండుగ జరుపుకున్నాడు. మంగళవారం సాయంత్రం తంజావూరు(Tanjavuru)లోని కావేరి నదికి కుటంబాన్ని తీసుకొని వెళ్లాడు.

ఈ వార్తను కూడా చదవండి: Collector: లెమన్ స్పూన్ పోటీల్లో కలెక్టర్ ఫస్ట్


ఈ నేపథ్యంలో తన పిల్లలతో నీటిలో దిగిన సౌందరరాజన్‌, కొంతసేపటికి నది ఉదృతి పెరుగుతుండటంతో వెనక్కి వచ్చేయమని కుమార్తెలు పిలవగా బయటకు వచ్చే క్రమంలో నీటి ఉదృతి పెరిగి ఆ ప్రవాహంలో సౌందరరాజన్‌ కొట్టుకుపోయాడు. పిల్లలు కేకలు వేస్తూ కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు స్థానికులతో అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కాని ఈ లోపే అతను ఊపిరాడక మృతిచెందాడు. ఆనందంతో జరుపుకొనే పండుగ వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది.

city1.jpg


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 01:38 PM