ఆ రాశివారు ఈ వారం అంతా ఓర్పుతో ఉండాల్సిందే..
ABN , Publish Date - Mar 23 , 2025 | 07:37 AM
ఆ రాశి వారు ఈ వారం అంతా ఎంతో ఓర్పుతో పనిచేస్తే మంచిదని ప్రముఖ్య జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలించినట్లయితే..

అనుగ్రహం
23 - 29 మార్చి 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమా నాలకు తావివ్వవద్దు. మీ యత్నాలను సన్ని హితులు ప్రోత్సహిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. సోమవారం నాడు ముఖ్యుల సం దర్శనం వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందు కుంటారు. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
సత్కాలం సమీపిస్తోంది. ఆలోచనలు కార్యరూపంలో పెట్టండి. స్వయంకృషితోనే లక్ష్యాలు సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచ యాలు ఉన్నతికి దోహదపడతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించు కోండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. మీ శ్రీమతిని ఇబ్బంది పెట్టొద్దు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
సర్వత్రా అనుకూలం. అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ కృషి ఫలిస్తుంది. అవకా శాలను అందిపుచ్చుకుంటారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. సామరస్యంగా మెలగండి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయ వంతమవుతుంది. ఆటుపోట్లకు దీటుగా స్పందిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగల్గుతారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం.అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. అనవసర విషయాలకు ప్రాధాన్యమివ్వొద్దు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఓర్పుతో యత్నాలు కొనసాగించండి. సంకల్పబలంతోనే విజయం సాధిస్తారు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పత్రాల రెన్యువల్‌ను అశ్రద్ధ చేయ కండి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. పనుల్లో ఆటంకాలెదురైనా పూర్తి చేయగల్గు తారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
కీలక నిర్ణయాలు తీసు కుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టు జరుగుతాయి. ఆటంకాలెదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరి స్థితులు అనుకూలిస్తాయి. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు త్వరితగతిన సాగు తాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోష పరుస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
ఈ వారం అనుకూల దాయకం. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విష యాన్నీ తీవ్రంగా భావించవద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పట్టు దలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. పెట్టుబడుల విషయంలో పున రాలోచన శ్రేయస్కరం. భేషజాలకు పోవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
అభీష్టం సిద్ధిస్తుంది. ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అందరితోనూ మితంగా సంభాషిం చండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
లక్ష్యసాధనలో సఫలీకృతులవు తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవం తమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను దక్కిం చుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. గురు వారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగి స్తుంది. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
వాక్పటిమతో రాణిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెల గాలి. పొదుపు ధనం అందుతుంది. విలా సాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవు తాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తేలికగా కొట్టివేయొద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. మీ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టు దలతో శ్రమిస్తే విజయం తథ్యం. పెద్దల హితవు మీపై చక్కని ప్రభావం చూపుతుంది. ఆదాయం సంతృప్తికరం. పరిచయస్తులకు ధనసహాయం అర్థిస్తారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన పనులు వాయిదా వేసుకుంటారు. పిల్లల విషయంలో శుభపరిణామాలున్నాయి.