Mahakumbh 2025: 45 కోట్ల మంది భక్తులు.. 40 వేల మంది సెక్యూరిటీ.. మహా కుంభమేళాకు ఘనమైన ఏర్పాట్లు..
ABN , Publish Date - Jan 13 , 2025 | 11:21 AM
గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమానికి నెలవైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ ఈ మహా కుంభమేళాకు వేదిక. పుష్య పౌర్ణమి రోజైన సోమవారం ప్రారంభం అయిన ఈ కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 45 కోట్ల మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్మాత్మిక వేడుక, ఈ భూమి మీదే అత్యధిక మంది జనాలు తరలి వచ్చే సందర్భం అయిన మహా కుంభమేళా 2025 (Kumbh mela)కు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లను చేసింది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమానికి నెలవైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (Prayagraj) ఈ మహా కుంభమేళాకు వేదిక. పుష్య పౌర్ణమి రోజైన సోమవారం ప్రారంభం అయిన ఈ కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 45 కోట్ల మంది ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు (Mahakumbh 2025).
మహా కుంభమేళాకు హాజరయ్య భక్తుల సౌకర్యార్థం యూపీ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని ఏర్పాట్లను చేసింది. ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో 40 వేల మంది సిబ్బందితో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలతో సహా ఆధునాతన పరికరాలతో పోలీసులు పహారా కాస్తున్నారు. త్రివేణి సంగమంలో పడవలపై కూడా పెట్రోలింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక, భక్తుల బస కోసం ఏకంగా 1.50 లక్షల టెంట్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో 4.5 లక్షల కొత్త కరెంట్ కనక్షన్లకు అవకాశం కల్పించబోతున్నారు.
సోమవారం తెల్లవారుఝాము నుంచే లక్షలాది మంది భక్తులు ప్రయాగరాజ్‌కు చేరుకుని పుణ్య స్నానాలు చేసి పూజలు చేస్తున్నారు. ఉదయం 7:30 గంటలకే దాదాపు 35 లక్షల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానం చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కుంభమేళా కోసం పది వేల ఎకరాలను కేటాయించినట్టు, ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు ఉండగలిగేలా ఏర్పాట్లు చేసినట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే ఆలయాలు, సాధువుల అఖాడాలతో పాటు కీలక స్థావరాలను రక్షించేందుకు ప్రయోగరాజ్ చుట్టూ బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం క్లిక్ చేయండి..