Share News

Mahakumbh 2025: తొలిరోజే కోటిన్నర మంది పుణ్య స్నానాలు.. తప్పిపోయిన వారు ఏం చేయాలి?

ABN , Publish Date - Jan 14 , 2025 | 09:45 AM

పుష్య పౌర్ణమి రోజైన సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు.

Mahakumbh 2025: తొలిరోజే కోటిన్నర మంది పుణ్య స్నానాలు.. తప్పిపోయిన వారు ఏం చేయాలి?
Mahakumbh 2025

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌ (UttarPradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి రోజైన సోమవారం ప్రారంభమైన మహా కుంభమేళా (Mahakumbh 2025) 45 రోజుల పాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. తొలి రోజే త్రివేణీ సంగమంలో కోటిన్నర మంది స్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు. విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో త్రివేణీ సంగమంలో స్నానాలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది.


ఈ మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లు ఖర్చుపెడుతోంది. కనీ వినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తోంది. భక్తజనసంద్రం కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు తప్పిపోతున్నారు. అలా తప్పి పోయిన వారి కోసం కూడా యూపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలి రోజైన సోమవారం కనీసం 250 మంది తమ వారి నుంచి తప్పిపోయారు. ఇలాంటి వారి కోసం ``భులా-భట్కా`` క్యాంపులను ఏర్పాటు చేశారు. ఎవరు తప్పిపోయిన ఈ క్యాంప్ దగ్గరకు వెళ్తే.. పేరు, ఊరు, ఫ్యామిలీ మెంబర్ల వివరలను మైక్‌ల ద్వారా చదువుతున్నారు. తప్పిపోయిన వారిని తిరిగి తమ కుటుంబాలతో కలుపుతున్నారు. ఒకవేళ ఎవరూ రాకపోతే వారిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచుతున్నారు.


ఇలా తప్పి పోయిన వారి కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. మహిళలు, పిల్లల కోసం ``ఖోయా-పాయా`` అంటూ వేర్వేరు క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల వద్దనే వెయిటింగ్ రూమ్స్, మెడికల్ క్యాంప్స్, రిఫ్రెషింగ్ రూమ్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి సెంటర్ వద్ద 55 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలను కూడా ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వారి వివరాలను ఆ టీవీల్లో డిస్‌ప్లే చేస్తున్నారు. అలాగే తప్పిపోయిన వారి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వెంటనే వివరాలు చేరవేసేలా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 14 , 2025 | 09:45 AM