Share News

Ugadi: ఉగాది.. మీ రాశిఫలాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 08:56 PM

Ugadi: శ్రీవిశ్వవసు నామ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. వివిధ రాశులు.. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది సవివరంగా..

Ugadi: ఉగాది.. మీ రాశిఫలాలు

తెలుగు సంవత్సరాది ఉగాది మరికొద్ది రోజుల్లో రానుంది. 2025, మార్చి 30వ తేదీన చైత్ర శుక్ల పక్ష పాడ్యమి రోజు.. శ్రీవిశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. అయితే 12 రాశుల వారు ఆరోగ్య, ఆర్థిక పరంగా ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయంటే.

మేష రాశి: ఈ వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14,రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. బృహస్పతి తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండటం చేత వీరికి ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేదని చెప్పొచ్చు.

రాబడి తక్కువ. ఖర్చులు అధికం. అయితే ఈ రాశి వారు అప్పు చేయకూడదు. అలాగే అప్పు ఇవ్వకుండా చూసుకోవాలి. ఏలినాటి శని వలన అనుకోని సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులతోపాటు వ్యాపారులకు అధిక ఇబ్బందులు కలిగే అవకాశముంది.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఈ రాశి వారి ఆరోగ్యం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఆర్థికం,ఆరోగ్యం విషయంలో శుభ ఫలితాలు పొందడానికి శ్రీ మేతో దక్షిణామూర్తి‌ని పూజించాలి.దశరథ ప్రోక్త శని స్త్రోత్తం పారాయణం చేయాలి. శనికి తైలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు పొంద వచ్చు.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 11,వ్యయం 5,రాజపూజ్యం 1,అవమానం 7. ఈ రాశి వారికి శని లాభ స్థానంలో అనుకూలంగా ఉంది.అలాగే బృహస్పతి ధన స్థానంలో అనుకూలంగా ఉండటం చేత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది.

ఈ రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు.పెట్టుబడులు సైతం కలిసి వస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం ఉంది. వీరికి ఆర్థిక పరంగా అన్ని విధాల అనుకూలమైన కాలం. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం ఉంది. ఈ రాశి వారు శ్రీలక్ష్మీదేవిని పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.


మిథున రాశి: ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14,వ్యయం 2,రాజపూజ్యం 4,వ్యయం 3. ఈ వారికి శని దశమ స్థానంలో అనుకూలం.జన్మరాశిలో బృహస్పతి సంచారం చేత ఆర్థికంగా ఈ ఏడాది కలిసి వస్తుందని చెప్ప వచ్చు. కొత్త పెట్టుబడుల కోసం నగదు సమకూర్చుకుంటారు.ఆర్థిక పరంగా పురోగతి ఉంది. కానీ ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మ రాశిలో గురుని ప్రభావం కారణంగా.. టెన్షన్లు,ఒత్తిళ్లు అధికం. బీపీ,హార్ట్ సమస్యలతో ఇబ్బంది పడే సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ అవసరం. ఆదిత్య హృదయాన్ని పారాయణం, శ్రీమేథో దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించడం వల్ల మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆదాయం 8,వ్యయం 2,రాజపూజ్యం 7,అవమానం 3.కర్కాటక రాశి వారికి ఈ ఏడాది గురుడు వ్యయ స్థానంలో సంచరించడంతోపాటు శని భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించనున్నారు. దీంతో ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా ఖర్చులతో కూడుకున్న ఫలితాలున్నాయి.

అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంది. ఆర్థికపరంగా ఉద్యోగస్థులకు సంపాదన ఉన్నప్పటికీ కుటుంబ అవసరార్థం అనుకోని ఖర్చులు చేయవలసిన స్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్థులకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆరోగ్య నిమిత్తం ధనము వ్యయమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా శుభఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించాలి. నవగ్రహ పీడా స్త్రోత్రం పఠించడం చేత శుభ ఫలితాలు పొందుతారు.


సింహ రాశి: ఈ రాశి వారికి ఆదాయం 11,వ్యయం 2,రాజపూజ్యం 7,అవమానం 3. ఈ రాశి వారికి ఈ ఏడాది అష్టమ శని సంచారం. అలాగే లాభ స్థానంలో గురుడు అనుకూలంగా సంచరించనున్నాడు. జన్మరాశిలో కేతువు సంచారం కారణంగా.. ఆర్థిక పరంగా మధ్యస్తం ఉంటాయి. అలాగే అనుకూల ఫలితాలున్నాయి. ఆదాయాన్ని పెంచుకొంటారు.ఖర్చులను తగ్గించుకుంటారు.

ఉద్యోగస్థులకు ప్రమోషన్ల కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు సైతం కలిసి వస్తాయి. పనులలో ఆలస్యం. ఆరోగ్య సమస్యలు కొంత చికాకులు తెప్పిస్తాయి. సింహ రాశి వారికి ఆరోగ్య విషయంలో అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఆరోగ్యం కోసం శనికి తైలాభిషేకం. దశరథ ప్రోక్త శని స్త్రోత్రంతోపాటు సూర్యాష్టకం పఠించాలి.

కన్యా రాశి: ఈ రాశి వారి ఆదాయం 14,వ్యయం 2,రాజపూజ్యం 6,అవమానం 9. ఈ రాశి వారికి ఈ ఏడాది శని కళత్ర స్థానంలో అనుకూలంగా.. అలాగే గురుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల ఆర్థిక పరంగా ఈ రాశికి ఈ ఏడాది కలిసి వస్తుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు రానున్నాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది.ఖర్చులను తగ్గించుకుంటారు.

సమాజంలో కీర్తి,గుర్తింపు పొందుతారు. ఆరోగ్య విషయాల్లో మార్పు కోసం ప్రయత్తిస్తారు. ఈ రాశి వారికి మరిన్ని శుభఫలితాల కోసం దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించండంతోపాటు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి.


తులా రాశి: ఈ రాశి వారికి ఆదాయం 11,వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి ఈ ఏడాదిలో శని ఆరవ స్థానంలో..గురుడు భాగ్య స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఆర్థికంగా అద్భుతమైన సంవత్సరం. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.పెట్టుబడులు సైతం మంచి ఫలితాలు ఇవ్వనున్నాయి.

నూతన గృహాలు వంటివి అనుకూలిస్తాయి. రుణ బాధల నుంచి బయటపడతారు.ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఈ ఏడది తులా రాశి వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్థులకు ధన లాభం. స్త్రీలకు ఆరోగ్యం,సౌఖ్యం కలుగుతుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ ఏడాది శని పంచమ స్థానంలో అనుకూలిస్తుంది. బృహస్పతి అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. ఈ రాశి వారికి పంచాంగ రీత్యా ఈ ఏడాది ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పట్టే సూచనలున్నాయి.

అష్టమ గురుడి సంచారం వల్ల ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. ధన లాభం ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఖర్చులు ఉంటాయి. మీరు సంపాదన.. అప్పులు, లోన్లు తీర్చడానికి వినియోగిస్తారు. ఖర్చులు నియంత్రించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తిని పూజించండి. నవగ్రహ పీడాహార స్త్రోత్నాన్ని పారాయణం చేయాలి.


ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఆదాయం 5,వ్యయం 5,రాజ్యపూజ్యం 1,అవమానం 5. శని నాలుగో స్థానంలో సంచరించడం వలన, అర్ధమాష్టమ శని ప్రభావం చేత, బృహస్పతి కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత ఆర్థికంగా ఈ ఏడాది మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి.

కొత్తగా పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియని వారికి ధన సహాయం చేయవద్దు. అప్పు ఇవ్వడంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్థులకు ఆర్థికంగా మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు.స్త్రీలకు ఆరోగ్య, కుటుంబ సమస్యలు కొంత మేర ఇబ్బంది పెడతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి దశరథ ప్రోక్త శని స్త్రోత్తాన్ని నిత్యం పారాయాణం చేయాలి. అలాగే దక్షిణామూర్తిని పూజించాలి.

మకర రాశి: ఈ రాశి వారికి ఆదాయం 8,వ్యయం 14,రాజ పూజ్యం 4,అవమానం 5. ఈ రాశి వారికి శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే బృహస్పతి శత్రు స్థానంలో ప్రతికూలంగా సంచరించడం, వాక్ స్థానంలో రాహువు, ఆయువు స్థానంలో కేతు ప్రభావం చేత మకర రాశి వారికి ఆర్థికంగా మధ్యస్థ ఫలితాలు కలగనున్నాయి. అప్పుల బాధ నుంచి బయట కొచ్చే ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

అప్పులు,లోన్లు తీర్చే క్రమంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన పెట్టుబడుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్థులకు మధ్యస్థంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో లాభాలు మాత్రం ఉండవు. అనారోగ్య సూచనలున్నాయి.

ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీ వల్లిదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరిన ఆలయాన్ని దర్శించాలి. శ్రీసుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.


కుంభ రాశి: ఈ రాశి వారికి ఆదాయం 8,వ్యయం 14,రాజపూజ్యం 7,అవమానం 5. ఈ రాశి వారికి ఈ ఏడాది జన్మరాశిలో రాహువు సంచారం, వాక్ స్థానంలో శని సంచారం,బృహస్పతి పంచమ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత.. ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు తీసుకోవద్దు. ఇవ్వవద్దు.

ఈ రాశి వారికి సమయానికి డబ్బు అందకపోవడం, ఖర్చు అధికం కావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్థులకు ఆర్థికపరంగా మధ్యస్థంగా ఉంటుంది. జన్మ రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిళ్లు,సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయాలి. దక్షిణామూర్తిని పూజించాలి.

మీన రాశి: ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3,అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో బృహస్పతి చతుర్థ స్థానంలో అనుకూలంగా సంచరించడం.శని జన్మరాశిలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం ఉంది. మీనరాశి వారికి ఈ ఏడాది ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది. ఖర్చులు నియంత్రించుకునేందు ప్రయత్నం చేయాలి. తెలియని వాటిలో పెట్టుబడులు పెట్టవద్దు. అప్పులు ఇవ్వవద్దు.

వ్యాపారస్థులకు ఆర్థికపరంగా మధ్యస్థ సమయం. ఉద్యోగస్థులకు అంత అనుకూలంగా లేదు. ఈ రాశి వారు.. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతుంది. బీపీ, షుగర్ తదితర ఆనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందిపెటతాయి. ఈ రాశి వారు శుభఫలితాల కోసం శనివారం నవగ్రహ ఆలయాలను దర్శించాలి. శనికి తైలాభిషేకవం వంటివి చేసుకోండి.నవగ్రహ పీడాహర స్త్రోత్రాన్ని పఠించండి.

ఈ వార్తలు కూడా చదవండి..

Ugadi: ఉగాది నుంచి ఈ రాశుల వారికి సూపర్

LRS Number: ఎల్ఆర్ఎస్ నంబర్ మరిచిపోయారా..

Nirmala Sitaraman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు

Chain Smoking: చైన్ స్మోకింగ్ మానేయాలంటే.. ఇలా చేయండి..

Actress VishnuPriya: నటి విష్ణు ప్రియకు హైకోర్టులో ఎదురు దెబ్బ

Updated Date - Mar 28 , 2025 | 08:58 PM