Traditions: శుక్రవారం రోజు ఈ పనులు ఎందుకు చేయకూడదో తెలుసా..
ABN , Publish Date - Mar 28 , 2025 | 08:56 AM
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక రూపాయి కాసు తీసుకుని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. పువ్వులు, అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే..

శుక్రవారం (Friday) గురించి హిందూ సాంప్రదాయాలు (Hindu traditions), జానపద నమ్మకాల ప్రకారం కొన్ని పనులను చేయకూడదని చెబుతారు. ఇవి ప్రాంతీయ ఆచారాలు, వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, సాంస్కృతికంగా పాటించబడతాయి. శుక్రవారం శుక్ర గ్రహానికి అధిపతిగా భావించబడుతుంది. ఇది సంపద, సౌందర్యం, ప్రేమ, ఆనందానికి సంబంధించినది. అందువల్ల, ఈ రోజు కొన్ని పనులు అశుభంగా (Inauspicious) లేదా ఆ గ్రహ శక్తిని దెబ్బతీసేవిగా పరిగణించబడతాయి. ప్రతీ ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం (Goddess Lakshmi blessings) కలగాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో కొన్ని మార్పులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కొన్ని పరిహారాలని పాటిస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
Also Read..: జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన ఆలయాలు ఏమిటో తెలుసా..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం..
శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. రూపాయి కాసుతో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒక రూపాయి కాసు తీసుకుని శుక్రవారం నాడు లక్ష్మీదేవి పాదాల వద్ద పెట్టండి. పువ్వులు, అష్టగంధ మొదలైన వాటితో ఆ కాసుకు పూజ చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తర్వాత రోజు రూపాయి కాసుని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి మీ వద్ద ఉంచుకోండి. శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పాటించడం వలన దురదృష్టం తొలగిపోయి, అదృష్టం కలుగుతుంది.
శుక్రవారం చేయకూడని పనులు..
హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఓ ప్రత్యేకత ఉంది. శుక్రవారం ఏ పని చేసినా శుభం కలుగుతుందని విశ్వాసం. అయితే తెలిసో తెలియకో శుక్రవారం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కష్టాలు కలుగుతాయి. అసలు శుక్రవారం ఏవి చేయకూడదో తెలుసుకుందాం.
కొంతమంది శుక్రవారం రోజు పూజామందిరంలో దేవీ దేవతల విగ్రహాలను, పటాలను, పూజలో వాడే పూజ సామాగ్రిని శుభ్రం చేసి, మళ్ళీ పసుపు కుంకుమలు పెట్టి పూజలు చేస్తుంటారు. కానీ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులు చేయకూడదు. దేవుని గదిలో విగ్రహాలు, పటాలను శుభ్రం చేసుకోవడానికి బుధ, గురు వారాలు, ఆది, సోమవారాలు మంచిది. శుక్రవారం శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడితే లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి ఇల్లు విడిచి వెళ్లిపోతుందంట..
కొంతమంది ఇంట్లో పనికిరాని, విరిగిపోయిన దేవతల విగ్రహాలను, పగిలిపోయిన అద్దం, దేవుళ్ల పటాలను దేవాలయంలో చెట్టు కిందనో, లేకుంటే మరో చోటనే వదిలి పెడుతూ ఉంటారు. కానీ ఈ పనులు శుక్రవారం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. శుక్రవారం ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి కానీ బయటకు పంపితే దారిద్య్రం, బాధలు తప్పవు. అలాగే శుక్రవారం రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అత్యవసరంగా డబ్బు అప్పుగా అడిగితే ఆర్థిక సహాయం చేయండి కానీ అప్పు ఇవ్వొద్దు. అలాగే ఎవరి నుంచి చేబదులు కానీ, అప్పు గాని తీసుకోకూడదు. అలా చేస్తే జీవితాంతం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.
జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం: శుక్రవారం శుక్రుడికి సంబంధించిన సౌందర్య దినంగా భావిస్తారు కాబట్టి, జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు..
ఇంటిని ఖాళీ చేయడం లేదా బయటకు వెళ్లడం: కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఇంటిని ఖాళీ చేసి బయటకు వెళ్లడం లేదా దీర్ఘ ప్రయాణాలు చేయడం అశుభంగా భావిస్తారు.
మాంసాహారం తినడం: శుక్రవారం లక్ష్మీదేవి లేదా శాంతికి సంబంధించిన రోజుగా కొందరు భావిస్తారు కాబట్టి, మాంసాహారం లేదా మద్యం సేవించడాన్ని నిషేధిస్తారు.
వస్త్రాలు కొనడం లేదా కుట్టడం: కొన్ని సాంప్రదాయాల్లో శుక్రవారం కొత్త బట్టలు కొనడం లేదా కుట్టడం చేయరు, ఎందుకంటే ఇది శుక్ర గ్రహ శక్తిని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.
చేస్తే ఏమవుతుంది..
ఈ పనులు చేయడం వల్ల శారీరకంగా తక్షణ ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు, కానీ జ్యోతిష్య లేదా సాంప్రదాయ నమ్మకాల ప్రకారం.. కొత్త పనులు ప్రారంభిస్తే.. అవి విజయవంతం కాకపోవచ్చు లేదా అడ్డంకులు ఎదురవుతాయని చెబుతారు.
శుక్రవారం అశుభంగా భావించే పనులు:
అశుభంగా భావించడం అనేది సాధారణంగా శుక్ర గ్రహ శక్తిని దెబ్బతీసే లేదా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తగ్గించే పనులతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు, గొడవలు పడడం, పాత వస్తువులను విసిరేయడం, ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం వంటివి కూడా ఈ రోజు మానుకోవాలని చెబుతారు. అయితే, శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి పూజకు అనుకూలమైన రోజుగా భావిస్తారు. కాబట్టి, ఈ రోజు శుభ్రత, పూజలు, దానధర్మాలు చేయడం శ్రేయస్కరంగా చెబుతారు.
లక్ష్మీదేవిని నిమజ్జనం చేయకూడదు..
లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పనులు చేస్తారు. కానీ శుక్రవారం రోజు మాత్రం లక్ష్మీదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. కొంతమంది ఇంట్లో విరిగిపోయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేసి దాని స్థానంలో కొత్త దాన్ని తీసుకొచ్చి పెడతారు. కానీ శుక్రవారం రోజు పొరపాటున కూడా విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదు. కావాలంటే కొత్త ప్రతిమ తీసుకొచ్చి పూజ గదిలో ప్రతిష్టించుకోవచ్చు.
మహిళలు శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి, జన్మ నక్షత్రం రోజుల తలంటు స్నానం చేయకూడదు. శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు. అలాగే గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టకూడదు. ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయని కొట్టడం చేయకూడదు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు, కుంకుమ తప్పని సరిగా రాయాలి. అలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
అమెరికాలో మకార్తీ భూతం మళ్లీనా?
For More AP News and Telugu News