Share News

Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

ABN , Publish Date - Mar 29 , 2025 | 03:14 PM

ప్రభుత్వ కోలువుల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. ఇటీవల ఏకంగా 9 వేలకుపైగా ఉద్యోగాలకు రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వేతనం ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
9970 ALP Posts Notification

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేయాలని రైల్వే బోర్డు ప్రకటించింది. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, చివరి తేదీ ఎప్పుడు, వేతనం ఎంత వంటి తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


జోన్ల వారీగా పోస్టులు

ప్రస్తుత నియామక ప్రక్రియలో జోన్ల వారీగా మొత్తం 9,970 ALP పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • సెంట్రల్ రైల్వే – 376 పోస్టులు

  • తూర్పు మధ్య రైల్వే – 700 పోస్టులు

  • నార్త్ సెంట్రల్ రైల్వే – 508 పోస్టులు

  • నార్త్ ఈస్టర్న్ రైల్వే – 100 పోస్టులు

  • ఈశాన్య సరిహద్దు రైల్వే – 125 పోస్టులు

  • ఉత్తర రైల్వే – 521 పోస్టులు

  • నార్త్ వెస్ట్రన్ రైల్వే – 679 పోస్టులు

  • సౌత్ సెంట్రల్ రైల్వే – 989 పోస్టులు

  • సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే – 568 పోస్టులు

  • సౌత్ ఈస్టర్న్ రైల్వే – 921 పోస్టులు

  • దక్షిణ రైల్వే – 510 పోస్టులు

  • వెస్ట్ సెంట్రల్ రైల్వే – 759 పోస్టులు

  • వెస్ట్రన్ రైల్వే – 885 పోస్టులు

  • మెట్రో రైల్వే కోల్‌కతా – 225 పోస్టులు


ALP పోస్టులకు దరఖాస్తు తేదీలు

ఈ ALP పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 10 ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2025. డిగ్రీ లేదా డిప్లొమా, ఐటీఐ వంటివి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారు. వీటి కోసం అప్లై చేయాలంటే అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు ఉండగా, గరిష్ట వయస్సు 30 ఏళ్లుగా ఉంది.


వేతనం ఎంత..

ఆసక్తి గల అభ్యర్థులు మే 9, 2025 రాత్రి 11:59 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 2 (7వ CPC)లో ప్రారంభ జీతం రూ. 19,900 నుంచి రూ. 35 వేల వరకు లభిస్తుంది. ఈ ఉద్యోగంలో మంచి జీతంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ALP నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదు. జాబ్ వివరాలు, పూర్తి అర్హతలు, పరీక్ష విధానం వంటి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో ప్రకటించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 29 , 2025 | 04:12 PM