Share News

GATE 2025 Results: గేట్ 2025 ఫలితాలు విడుదల..ఇలా ఫలితాలను చెక్ చేసుకోండి

ABN , Publish Date - Mar 19 , 2025 | 03:32 PM

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2025 రిజల్ట్స్ వచ్చేశాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT రూర్కీ) ఈ ఫలితాలను విడుదల చేసింది.

GATE 2025 Results: గేట్ 2025 ఫలితాలు విడుదల..ఇలా ఫలితాలను చెక్ చేసుకోండి
GATE 2025 Results out

గేట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా గేట్ 2025 ఫలితాలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ విడుదల చేసింది. గేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లైన gate2025.iitr.ac.in లేదా goaps.iitr.ac.inలలో చెక్ చేసుకుని తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం గేట్ పరీక్ష నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీకి అప్పగించారు.


గేట్ 2025 పరీక్షను ఫిబ్రవరి 1, 2, 15, 16, 2025 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించారు. ఈ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో జరిగింది.

గేట్ 2025 ఫలితాలు ఎలా తనిఖీ చేయాలి

గేట్ 2025 ఫలితాలను తనిఖీ చేసుకోవడం చాలా సులభం. మీరు ఈ సులభమైన స్టెప్స్ అనుసరించాల్సి ఉంటుంది. ఫలితాలను తెలుసుకోవడానికి ముందు అధికారిక వెబ్‌సైట్ (gate2025.iitr.ac.in లేదా goaps.iitr.ac.in)ను సందర్శించండి. ఆ తర్వాత లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి. మీ లాగిన్ వివరాలను (రెజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్) నమోదు చేయండి. ఆ తర్వాత సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.


గేట్ 2025 స్కోర్‌కార్డు

గేట్ 2025 ఫలితాలను ప్ర‌క‌టించిన వెంటనే, అభ్యర్థులు వారి స్కోర్‌కార్డులను మార్చి 28, 2025 నాటికి అధికారిక వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు.

ఈ IITలలో అడ్మిషన్ GATE స్కోర్ ఆధారంగా ఉంటుంది.

  • ఐఐటీ మద్రాస్

  • ఐఐటీ ఢిల్లీ

  • ఐఐటీ హైదరాబాద్

  • ఐఐటీ రూర్కీ

  • ఐఐటీ మండి

  • ఐఐటీ ఖరగ్‌పూర్

  • గత సంవత్సరాల్లో ఎంత మంది విద్యార్థులు అర్హత సాధించారు?

ఆయా సంవత్సరాలలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య

  • 2024లో 1,29,268

  • 2023లో 6.70 లక్షలు

  • 2022లో 1,12,678

  • 2021లో 7,11,542

  • 2020లో 9,13,275


గేట్ 2025 స్కోర్ ప్రయోజనాలు

గేట్ 2025 ఫలితాలు సాధించిన అభ్యర్థులు పలు విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గేట్ స్కోర్‌ను ఉపయోగించుకోవచ్చు. వీటిలో IITs, NITs, IIITs, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. గేట్ స్కోర్ ద్వారా అభ్యర్థులు ఇంజనీరింగ్, సైన్సెస్, టెక్నాలజీ రంగాలలో మాస్టర్ డిగ్రీ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఫలితాలు ఎంతో మంది యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తాయి.


ఇవి కూడా చదవండి:

Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి


Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 19 , 2025 | 03:36 PM