Share News

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా జాబ్..

ABN , Publish Date - Jan 02 , 2025 | 09:53 AM

కొత్త సంవత్సరంలో రైల్వే ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి శుభవార్త. ఇటివల దక్షిణ మధ్య రైల్వే 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌‌ను ప్రకటించింది. అయితే ఈ పోస్టులను ఎగ్జామ్ లేకుండానే భర్తీ చేయనున్నారు.

Railway Jobs: గుడ్ న్యూస్.. 4232 రైల్వే పోస్టులకు నోటిఫికేషన్, ఎగ్జామ్ లేకుండా జాబ్..
scr 4232 Apprentice Posts

రైల్వేలో ఉద్యోగం (Railway Jobs) చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వేలో (South Central Railway) 4,232 అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించారు. వీటి కోసం అప్లై చేయాలంటే మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై, ITI సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు. ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా, జనవరి 27, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ https://onlineregister.org.in/instructions.php అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ ట్రేడ్‌లలో నియామకాలు జరుగుతాయి.


విభాగాల వారీగా పోస్టులు

వీటిలో ప్రధానంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, AC మెకానిక్, పెయింటర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కోసం గరిష్టంగా 1053 పోస్టులు, ఫిట్టర్ కోసం 1742 పోస్టులు ఉన్నాయి. దీంతోపాటు ఏసీ మెకానిక్‌ కోసం 143, వెల్డర్‌ పోస్టులు 713, డీజిల్‌ మెకానిక్‌ పోస్టులు 142, పెయింటర్‌, ఇతర ట్రేడ్‌ల కోసం 74 ఖాళీలు ఉన్నాయి. ఈ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


కనీస వయస్సు, ఫీజు ఎంత

వీటి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా ఇవ్వబడుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. SC/ST/PWBD/మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.


జీతం ఎంత, ఏ పత్రాలు కావాలంటే..

దక్షిణ మధ్య రైల్వేలో (RRC SCR) ఈ అప్రెంటిస్ పోస్టుల ఎంపిక మెరిట్ ఆధారితంగా ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు వ్రాత పరీక్ష ఉండదు. కానీ అభ్యర్థులందరూ తప్పనిసరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం రూ. 7,700- రూ. 20,200 వరకు అందుకుంటారు. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే కావాల్సిన ముఖ్యమైన పత్రాలు: 10వ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటివి కల్గి ఉండాలి.


ఇవి కూడా చదవండి:

PM Modi: ప్రధానికి హిందూ సేన విజ్ఞప్తి.. ఈ దర్గాలో అలా చేయోద్దని..


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 02 , 2025 | 11:33 AM