Skin Care: ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు.. డెర్మటాలజిస్టు సూచన
ABN , Publish Date - Jan 04 , 2025 | 03:01 PM
ఎరుపు, గ్రీన్ టాటూలు, హెయిర్ రీబాండింగ్, కెమికల్ పీల్స్ వంటివాటి జోలికి అస్సలు వెళ్లొద్దని డెర్మటాలజిస్టు తెలిపారు. వీటితో వచ్చే ప్రమాదాలను కూడా వివరించారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్యాషన్ స్పృహ పెరిగాక జనాలు తమ సౌందర్యాన్ని కాపాడుకునేందుకు రకరకాల ట్రీట్‌మెంట్లు తీసుకుంటున్నారు. మరికొందరు తమ మనోభావలను వ్యక్త పరుచుకునేందుకు టాటూల బాట పడుతున్నారు. అయితే, చర్మానికి సంబంధించిన ట్రీట్‌మెంట్స్ విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని సోషల్ మీడియా వేదికగా ఓ డెర్మటాలజిస్టు కొన్ని కీలక సూచనలు చేశారు (Health).
సదరు డెర్మటాలజిస్టు చెప్పేదాని ప్రకారం, టూటు వేయించుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు టాటూలను అస్సలు వేయించుకోకూడదు. ఈ రంగులను తొలగించడం చాలా కష్టం. అంతేకాకుండా, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్రైట్ రంగులతో ఈ సమస్య ఎక్కువవుతుంది.
Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..
రింగులు తిరిగిన జుట్టును సరి చేసుకునేందుకు కొందరు రీబాండింగ్, లేదా స్ట్రెయిటెనింగ్‌కు మొగ్గుచూపుతారు. దీని వల్ల కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయట. హెయిర్ రీబాండింగ్ అంటే జుట్టుకు ఆత్మహత్యతో సమానమని సదరు డెర్మటాలజిస్టు చెప్పుకొచ్చారు. ఇందులో వాడే కఠినమైన రసాయనాలతో జుట్టు పెళుసుగా మారి త్వరగా ఊడిపోతుందని, కాబట్టి జుట్టును యథాతథంగా ఉంచడమే మేలని సూచించారు.
చర్మంలోని ముడతలను తొలగించుకునేందుకు కొందరు డెర్మా ఫిల్టర్స్‌ను వాడుతుంటారు. ఇది కూడా అంత క్షేమకరం కాదని ఆమె పేర్కొన్నారు. సరైన విధానంలో డెర్మాఫిల్లర్స్ వాడకపోతే ముఖాకృతిలో అందవిహీనమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..
కొందరు చర్మాన్ని పునరుత్తేజితం చేసేందుకు కెమికల్ పీల్స్ వాడుతుంటారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్యురాలు హెచ్చరించారు. 40 దాటిన మహిళలకు ఈ ట్రీట్‌మెంట్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని హెచ్చరించారు. చర్మంపై ఇరిటేషన్ మొదలవడం, ట్రీట్‌మెంట్ నుంచి కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటివి తలెత్తుతాయని పేర్కొన్నారు. వయసుకు తగిన సున్నితమైన ట్రీట్‌మెంట్స్‌నే ఫాలో కావాలని మరీ మరీ చెప్పారు.
ఇక రోజూ సన్‌స్క్రీన్ వాడటం చాలా కీలకం. చర్మ క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా సన్‌స్క్రీమ్ దీర్ఘకాలిక రక్షణను ఇస్తుంది. దీంతో పాటు చర్మంపై ముసలితనం ఛాయలు కనబడకుండా నిరోధిస్తుంది. కాబట్టి, అందం కోసం వివిధ రకాల ట్రీట్‌మెంట్లను అనుసరించే వారు ఈ ట్రీట్‌మెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!