Share News

Food Problems: చికెన్ తిన్న వెంటనే తినకూడని పదార్థాలు ఏంటో తెలుసా..

ABN , Publish Date - Mar 24 , 2025 | 09:45 AM

చికెన్‌తోపాటు పాల ఉత్పత్తులు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్‌లోని ప్రొటీన్, పాలలోని క్యాల్షియం కలిస్తే జీర్ణప్రక్రియ కష్టంగా మారుతుందని అంటున్నారు.

Food Problems: చికెన్ తిన్న వెంటనే తినకూడని పదార్థాలు ఏంటో తెలుసా..
Food Problems

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ బాగా పెరిగిపోయింది. శరీరానికి కావాల్సిన పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా చికెన్, పాలు, గుడ్లు వంటి ప్రొటీన్ పదార్థాలను అధికంగా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చికెన్ తినే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కొంతమంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటుంటే.. మరికొంతమంది రోజూ తింటున్నారు. అయితే చికెన్‌తోపాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


చికెన్‌తోపాటు ఇవి తింటే డేంజర్..

చికెన్‌తోపాటు పాల ఉత్పత్తులు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్‌లోని ప్రొటీన్, పాలలోని క్యాల్షియం కలిస్తే జీర్ణప్రక్రియ కష్టంగా మారుతుందని అంటున్నారు. తద్వారా గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్-2022 నివేదికలు సైతం ప్రోటీన్, క్యాల్షియం కలయిక జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెంచుతుందని చెబుతోంది.


అలాగే చికెన్ తిన్న వెంటనే అధికంగా చక్కెర ఉండే పదార్థాలు తీసుకోవద్దని డైటీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్వీట్లు, జ్యూస్‌లు వంటివి తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అస్థిరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. తద్వారా చిన్న పని చేసినా శరీరం వెంటనే అలసిపోయిన స్థితికి చేరుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ సైతం పేర్కొందని అంటున్నారు. ఈ స్థితిని షుగర్ స్పైక్‌ అని, చికెన్ తిన్న తర్వాత స్వీట్లు తింటే జీవక్రియ దెబ్బతింటుందని వెల్లడించింది.


సాధారణంగా చికెన్‌ బిర్యానీల్లో నిమ్మకాయలు పిండుకుని తింటుంటారు. అయితే నిమ్మ, నారింజ వంటి పండ్లను చికెన్‌తో కలిపి తింటే గ్యాస్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లోని ఆమ్లాలు పొట్టలోని ద్రవాలతో కలిస్తే ఎసిడిటీ సమస్య వస్తుందని అంటున్నారు. ఈ రెండు కలిపి తింటే జీర్ణ ఎంజైముల అసమతుల్యం ఏర్పడుతోందని జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ 2021 అధ్యయనం చెబుతోంది.


చికెన్‌తోపాటు లేదా తర్వాత వెంటనే నూనెతో కూడిన స్నాక్స్ తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలా చేస్తే వాటిల్లోని అధిక కొవ్వులు జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుందని చెబుతున్నారు. తద్వారా నీరసం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ స్థితిని హై-ఫ్యాట్ డైట్ ఎఫెక్ట్‌గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అభివర్ణించింది.


చికెన్‌ను మద్యం ప్రియులు తెగ లాగించేస్తుంటారు. అయితే చికెన్ తినడానికి ముందైనా, తర్వాతైనా మద్యం తాగితే ప్రమాదమని డైటీషియన్లు చెబుతున్నారు. చికెన్ తిన్న వెంటనే ఆల్కహాల్ తాగితే కాలేయంపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో జీర్ణక్రియ మందగిస్తుందని హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే టాక్సిన్ లోడ్ పెరుగుతుందని ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం చెబుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Banana: ప్రతీ రోజూ అరటి పండు తింటే జరిగేది ఇదే..

మీరు రోజూ గోల్డెన్‌ రైస్‌ ఆరగిస్తున్నారా.. అయితే ఒక్కసారి..

Updated Date - Mar 24 , 2025 | 09:46 AM