Share News

Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..

ABN , Publish Date - Apr 04 , 2025 | 10:33 AM

Heart Attack: గుండెపోటుతో ఇటీవల చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గుండెపోటుతో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది యుక్తవయస్సు వారే కావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి.

Heart Attack: గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలివే..
heart health

ఇటీవల కాలంలో వస్తున్న ఆకస్మిక గుండెపోటు మరణాలను పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా మృతిచెందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే ముందు ఛాతిలో తీవ్రమైన నొప్పి, గుండెల్లో, గొంతులో మంట, కొంతదూరం నడిచినా ఆయాసం రావడం, ఎడమ చేయి బాగా లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చినా సరే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయకపోవడం తదితర కారణాల వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం.


కనిపించే లక్షణాలు ఇవే..

రక్తనాళాల గోడలపై రక్తాన్ని సరఫరా చేసే శక్తినే కొలిచేదే రక్తపోటు. గుండె రక్తాన్ని శరీరంలోకి తీసుకువెళ్లే రక్త నాళాల్లోకి పంపుతుంది. అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఈ రక్తపోటు మీ గుండె ఎంత రక్తాన్ని పంప్ చేస్తుంది. ఇంకా ఆ రక్తం మీ ధమనుల్లో ప్రవహిస్తుందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. బీపీ అంటే అర్థం మీ గుండె శరీరానికి రక్తాన్ని పంప్ చేసేది. సాధారణంగా రక్తపోటును కొలిచేందుకు ఏదో ఒక చేతికి పట్టి వేసి స్పిగ్మోమానోమీటర్ ఆధారంగా రీడింగ్ చూస్తారు. కానీ రెండు చేతులకు విడివిడిగా బీపీ రీడింగ్ చూసినప్పుడు తేడాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కొలిచినప్పుడు బీపీలో నమోదయ్యే తేడాలు హార్ట్ ఎటాక్‌కు సంకేతం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను హైపర్ టెన్షన్ జనరల్‌లో తాజాగా ప్రచురించారు.


పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

ఈ పరిశోధన కోసం ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన 24 అధ్యయనాలను విశ్లేషించారు. ఇప్పటి నుంచి బీపీ చూసుకునే వారు రెండు చేతులతోనూ సిస్టోలిక్ రీడింగ్ చూసుకోవాలని అధ్యయన బృందం సభ్యుడు డాక్టర్ క్రిస్‌క్లార్క్ తెలిపారు. బీపీని మిల్లీ మీటర్లలో కొలుస్తారు. రెండు చేతుల బీపీ రీడింగ్‌‌లో పది మిల్లీ మీటర్లకు మించి తేడాలు ఉంటే ఒక్కో డిగ్రీ పెరుగుదలకు ఛాతీలో నొప్పితో గుండెపోటు వచ్చే ప్రమాదం ఒక్క శాతం పెరుగుతుందని అధ్యాయనంలో కనుగొన్నారు. రెండు చేతుల బీపీ రీడింగ్‌లో ఐదు మీల్లీ మీటర్ల కంటే ఎక్కువ తేడా ఉంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని భావించాలని పరిశోధకులు చెబుతున్నారు.


బీపీ పరిక్షించే విధానం..

అందువల్ల ప్రమాదాలను ముందుగానే అంచనా వేయడానికి రెండు చేతులతో బీపీ చూసుకోవాలని తెలిపారు. అనారోగ్యాలు ఉన్నవారు ఇంతకుముందే సర్జరీలు చేయించుకున్నవారు బీపీ కొలిచే పరికరాలను సరిగా వాడాలని అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ చెబుతోంది. మణికట్టు వద్ద కాకుండా మోచేతి పై భాగంలో పట్టి వేసి బీపీ చూసుకోవాలి. బీపీ చూసేటప్పుడు సోఫాలో కాకుండా మాములు కుర్చీపై కూర్చోవాలి. దీంతో పాటు చేతిని కిందికి వదిలేయకుండా టేబుల్ పైన పెట్టాలి. ఒక్కో చేతికి రెండు లేదా మూడు సార్లు బీపీని చూసి పరిగణనలోకి తీసుకోవాలని ఏహెచ్ఏ సూచిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

Skin Care: తమలపాకుతో గ్లోయింగ్ స్కిన్.. ఈ 3 చర్మ సమస్యలు కూడా పోతాయ్..

Summer skincare: ఎండాకాలం వేడినీళ్లతో స్నానం చేస్తున్నారా..

Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..

Updated Date - Apr 04 , 2025 | 10:43 AM