Share News

Check Meat Quality Tips: మీరు తీసుకుంటున్న చికెన్, మటన్ తాజాదేనా..

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:57 PM

Check Meat Quality Tips: చికెన్, మటన్‌ను కొనేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం.

Check Meat Quality Tips: మీరు తీసుకుంటున్న చికెన్, మటన్ తాజాదేనా..
Chicken And Mutton Quality Tips

చికెన్, మటన్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చికెన్ (Chicken), మటన్‌ (Mutton) కూరలను లొట్టలేసుకుని మరీ తింటుంటారు కొందరు. అయితే మనం కొంటున్న చికెన్, మటన్ తాజాది, మంచి నాణ్యతతో కలిగి ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చికెన్, మటన్ ఫ్రెష్‌దా కాదా అనేది సులభమైన పద్దతుల్లో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.


రంగు పరిశీలించాలి: చికెన్, మటన్ రంగును పరిశీలించడం ద్వారా అది తాజాదా కాదా చెప్పొచ్చు. ఫ్రెష్ చికెన్ గులాబీ రంగులో ఉంటుంది. అలాగే మటన్ లేత ఎరుపు రంగులో ఉండాలి. బూడిద లేదా పసుపు రంగు, మచ్చలు ఉంటే అది తాజాది కాదని అర్థం. ఈ లక్షణాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నాణ్యతకు సంకేతాలుగా వెల్లడించింది.

వాసన: ఫ్రెష్ చికెన్, మటన్ సహజ వాసనను కలిగి ఉంటుంది. చెడు లేదా కంపు వాసన వస్తే అది కుళ్లినట్టే. వాసన అనేది మాంసం తాజాదానాన్ని నిర్ధారిస్తుంది అని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) చెబుతోంది.

గట్టిదనం: చికెన్ లేదా మటన్‌ను ముట్టుకుని చూసినప్పుడు గట్టిగా, స్థితిస్థాపకంగా ఉంటుంది. అయితే మాంసాన్ని వేలితో నొక్కినప్పుడు గుండ్రంగా మారి, తిరిగి రాకపోతే అది తాజాది కాదని అర్ధం. ఈ పద్ధతిని జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ (2021) ధృవకీరించింది.

Prevent Travel Sickness: ప్రయాణంలో వాంతులా.. ఇలా చేయండి చాలు


తేమస్థాయి: మాంసం ఉపరితలం తడిగా ఉండాలి. అలా కాకుండా జిగటగా, పొడిగా ఉన్నట్లైతే అది నాణ్యత లేనిదని అర్ధం. ఇదే.. మాంసం తేమస్థాయిని గుర్తించే మార్గమని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చెబుతోంది.

ప్యాకేజింగ్ తేదీ: మాంసాన్ని కొనుగోలు చేసేటప్పుడు ప్యాక్ చేసిన తేదీ, గడువు తేదీ తప్పనిసరి చూడాలి. రెండు రోజుల్లో వండకపోతే ఫ్రీజ్‌లో ఉంచండి. ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నిబంధనలు దీన్ని తప్పనిసరి చేస్తాయి.

సలహా: చికెన్, మటన్‌ను విశ్వసనీయ దుకాణాల్లో మాత్రమే కొనాలి. వండటానికి ముందు బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాలతో మాంసం నాణ్యతను సులభంగా గుర్తించవచ్చు.


ఇవి కూడా చదవండి...

Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం

Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల

Read Latest Health News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 01:10 PM