Prevent Pimples: ఈ తొక్క వాడితే.. ముఖంపై పింపుల్స్ రానే రావు..
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:15 PM
How to Prevent Pimples:మొటిమలు ముఖం అందాన్ని పాడుచేస్తాయి. బయట దుమ్ము ధూళి కాస్త పడగానే ఒకదానివెంట మరొకటి పుట్టుకొచ్చేస్తాయి. ఈ సమస్యతో బయట అందరిలో తిరగాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు అమ్మాయిలు. కానీ, ఈ తొక్క వాడితే మీ ముఖంపై మొటిమలు తొలగిపోయి అద్దంలా మెరిసిపోవడం ఖాయం. ఓ సారి ప్రయత్నించండి..

How to Prevent Pimples: ఎంత అందంగా తయారైనా ముఖంపై ఉన్న మొటిమలు లుక్‌ని పాడుచేస్తాయి. ఉబ్బెత్తుగా ఉందని.. చూసేందుకు అసహ్యంగా కనిపిస్తోందని..చాలామంది అమ్మాయిలు గిల్లేస్తుంటారు. అసలే మొటిమలు వచ్చిన చోట కాస్త దురద, మంట లాంటివి ఉంటాయి. ఇక గిల్లడం లాంటివి చేస్తే సమస్య మరింత పెద్దదవుతుందే తప్ప పోదు. ఈ సమస్య తీవ్రం కాకుండా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాను ట్రై చేసి చూడండి. ముఖ సౌందర్యం కోసం మీరు ఎప్పుడైనా నిమ్మకాయ తొక్కను ఉపయోగించారా? ఇందులోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు, సి-విటమిన్ చర్మరంధ్రాలను శుభ్రపరచి ముఖానికి సహజ మెరుపును తీసుకొస్తాయి. మొటిమల సమస్యను వేగంగా పోగొట్టే ఈ నిమ్మ తొక్కను ఎలా ముఖానికి అప్లై చేయాలో తెలుసుకోండి.
నిమ్మతొక్కతో ఫేస్ ప్యాక్ చేయడమెలా..
మీరు మొటిమలకు నిమ్మ తొక్కను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. దీని కోసం నిమ్మ తొక్కను చిన్న ముక్కలుగా చేయండి. తరువాత దానికి కొంచెం తేనె కలిపి ఆపై కాసింత శనగపిండి జోడించండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకుని మెల్లగా రుద్దండి. 10-15 నిమిషాల తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. 5 నిమిషాలు గడిచాక తిరిగి చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
పొడి చర్మానికి నిమ్మ తొక్కను ఎలా ఉపయోగించాలి..
నిమ్మ తొక్క వాడితే చర్మం జీవం కోల్పోకుండా తాజాగా ఉంటుంది. పొడిచర్మం ఉన్నవారు ముందుగా నిమ్మ తొక్కను మెత్తగా రుబ్బుకుని దానికి రోజ్ వాటర్ కలపాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖంపై సున్నితంగా పూసుకోవాలి. 5 నిమిషాలలోపే ముఖం కడిగేసుకోవాలి. ఈ విధంగా చేస్తే చర్మం పొడిబారకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
పిగ్మెంటేషన్ కోసం..
పిగ్మెంటేషన్ తగ్గించేందుకు కూడా నిమ్మ తొక్కను ఉపయోగించవచ్చు. ముందుగా మీరు నిమ్మ తొక్కకు కొద్దిగా బేకింగ్ సోడా కలపాలి. ఆ తర్వాత దీనిని ముఖంపై రాసుకుని చర్మాన్ని స్క్రబ్ చేసి ముఖం పూర్తిగా శుభ్రపరచుకోండి. ఇలా చేస్తే పిగ్మెంటేషన్ సమస్య తొలగిపోయి ముఖంగా క్లియర్ అవుతుంది.
Read Also : Diabetes Suggestions : డయాబెటిస్ ఉన్నవారు వేసవిలో పుచ్చకాయ తినడం మంచిదేనా..
Hair Transplant: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు సరైన సమయం ఇదేనా.. నిపుణులు ఏం
Chapati: రాత్రిళ్లు చపాతి తింటున్నారా? అయితే ఇది మీకోసమే..