Weight Loss: బరువు తగ్గడానికి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా?.. జాగ్రత్త..
ABN , Publish Date - Mar 20 , 2025 | 06:37 PM
కొంతమందికి బరువు తగ్గటం కోసం ఆరోగ్యాన్ని దెబ్బ తీసే పద్దతులు ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనే ప్రయత్నంలో లేని పోని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రమాదకరమైన సప్లిమెంట్స్ వాడుతున్నారు.

మనుషులకు ఓపిక బాగా తగ్గిపోయింది. ఏ విషయంలోనైనా తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు కోరుకుంటున్నారు. ఇదే కొన్ని సార్లు అనర్ధాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా అందం, ఆరోగ్యం విషయంలో క్విక్ రిజల్ట్స్ భారీ మూల్యాన్ని కోరుకుంటున్నాయి. కొంతమంది బరువు తగ్గడానికి.. అది కూడా తక్కువ టైంలో ఎక్కువ బరువు తగ్గడానికి సప్లిమెంట్స్ వాడుతున్నారు. ఆ సప్లిమెంట్స్ అసలు దేని కోసం తయారు చేశారో కూడా తెలుసుకోకుండా వాటిని వాడుతున్నారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. డయాబెటిస్, జీవక్రియ రోగాల కోసం తయారు చేసిన సప్లిమెంట్స్‌ను కూడా వాడేస్తున్నారు. అవి బరువుతగ్గటంతో ఉపయోగపడ్డా.. వాడకం పెరిగే కొద్దీ మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. వైద్యుల అనుమతి లేకుండా వాటిని వాడటం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి.
ఈ సప్లిమెంట్స్ ముందుగా మీ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. జీర్ణక్రియను తగ్గిస్తాయి. దీని కారణంగా వాంతులు, డయోరియా, మలబద్ధకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సప్లిమెంట్స్ కారణంగా పాంక్రియాటైటిస్, కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఈ సప్లిమెంట్స్ వాడితే.. లో బ్లడ్ షుగర్ వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇన్సులిన్ లెవెల్స్‌ను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. మెదడు పని తీరుపై ప్రభావం చూపి మానసిక రోగాలు తెచ్చే అవకాశం ఉంది. మూడ్ స్వింగ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఈ సప్లిమెంట్స్ కారణంగా గుండె పని తీరుపై ప్రభావం పడుతుంది.
ఇవి కూడా చదవండి :
Beauty Tips: ఖరీదైన క్రీములు..పార్లర్ ట్రీట్మెంట్లు అవసరమే లేదు..ఈ చిన్న
Alcohol Drinking : మద్యం అలవాటు పోవాలంటే.. ఈ ఒక్క డ్రింక్ చాలు..
Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..