Share News

Cancer: అవయ మార్పిడి ఆపరేషన్.. దాత నుంచి క్యాన్సర్ సోకి పేషెంట్ మృతి!

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:11 PM

లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఓ పేషెంట్‌ దాత లివర్ ద్వారా క్యాన్సర్ సోకి మృతి చెందిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. ఇది అత్యంత అరుదైన ఘటన అని వైద్యులు చెబుతున్నారు.

Cancer: అవయ మార్పిడి ఆపరేషన్.. దాత నుంచి క్యాన్సర్ సోకి పేషెంట్ మృతి!

ఇంటర్నెట్ డెస్క్: వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘటన అమెరికాలో తాజాగా వెలుగు చూసింది. లివర్ దాత నుంచి క్యాన్సర్ సోకడంతో ఓ పేషెంట్ అవయవ మార్పిడి ఆపరేషన్ తరువాత ఆరు నెలల్లోనే కన్నుమూశాడు. దాత‌కు క్యాన్సర్ ఉన్నట్టు మెడికల్ రికార్డుల్లో ఎక్కడా లేకపోవడం వైద్యులను కూడా ఆశ్చర్యపరిచింది. అయితే, దాతే కాన్సర్‌కు కారణమయ్యుండొచ్చని పరీక్షల్లో తేలడంతో అతడికి పరీక్షల్లో బయటపడని క్యాన్సర్ ఉండి ఉండొచ్చని వైద్యులు అంచనాకు వచ్చారు (Health).

Skin Care: ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు.. డెర్మటాలజిస్టు సూచన

పూర్తి వివరాల్లోకి వెళితే, అరిజోనాకు చెందిన ఓ వ్యక్తికి మద్య పానం అలవాటు కారణంగా లివర్ చెడిపోయింది. అవయవ మార్పిడి ఆపరేషన్ తప్పనిసరైంది. దీంతో, 50 ఏళ్ల దాత నుంచి లివర్ సేకరించారు. మరోవైపు, ఆపరేషన్‌కు ముందు చేసిన పరీక్షల్లో పేషెంట్‌కు క్యాన్సర్ ఉన్నట్టు ఎక్కడగా బయటపడలేదు.


దాతకు చేసిన పరీక్షల్లో కూడా ఆందోళన చెందాల్సిన అంశాలేవీ లేవు. దీంతో, వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దాత నుంచి సేకరించిన లివర్‌ను రోగికి అమర్చారు.

Boiled Egg Vs Omlette: ఉడకబెట్టిన గుడ్డు వర్సెస్ ఆమ్లెట్.. వీటిల్లో ఏది బెటరంటే..

ఆపరేషన్ తరువాత నాలుగు నెలలకు అల్ట్రాసౌండ్ పరీక్షల్లో రోగికి కొత్త అమర్చిన లివర్ భాగంలో ఏవో కణుతులు కనిపించాయి. ఈ ఫలితాలపై డాక్టర్లు కచ్చితమైన అంచనాకు రాలేకపోయారు. ఆ తరువాత ఆరు నెలలకే మరో మూడు కణుతులు పుట్టుకొచ్చాయి. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కణాలని పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు పీసీఆర్ పరీక్ష నిర్వహించగా దాత నుంచే ఈ క్యాన్సర్ ఉద్భవించి ఉండొచ్చనే వాదనకు బలం చేకూర్చే ఫలితాలు వచ్చాయి. అప్పటికే దాత కన్నుమూసి ఉండటంతో అతడికి పరీక్షల్లో బయటపడకుండా ఉన్నా క్యాన్సర్ ఉండి ఉండొచ్చన్న నిర్ధారణకు వచ్చారు.


Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!

ఇక రోగిలో క్యాన్సర్ బాగా ముదిరిపోవడంతో మరో ఆపరేషన్ లేదా ఇతర చికిత్స అందించే వీలు కూడా లేకుండా పోయింది. ఇది చాలా అరుదైన ఘటన అని వైద్యులు చెప్పారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే నమోదయ్యాయని అన్నారు. ఎవరూ ఊహించజాలని పరిణామమని వ్యాఖ్యానించారు.

Smoking: రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం కాదని అనుకుంటున్నారా? ఇది ఎంతటి ప్రమాదమో తెలిస్తే..

Read Latest and Health News

Updated Date - Jan 09 , 2025 | 11:11 PM