Share News

ఇదేం విడ్డూరం.. తల్లికి కాన్పు చేసిన 13 ఏళ్ల బాలుడు..

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:51 AM

13 ఏళ్ల బాలుడు తల్లికి కాన్పు చేశాడు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీనిపై జనాలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది తిడుతుంటే మరికొంతమంది పొగుడుతున్నారు.

ఇదేం విడ్డూరం.. తల్లికి కాన్పు చేసిన 13 ఏళ్ల బాలుడు..
Boy Helps Deliver Mother In China

కొంతమంది పిల్లలకు షాపుకు వెళ్లి ఏవైనా వస్తువులు తీసుకురమ్మంటే సరిగా గుర్తుకు ఉండదు. చెప్పిన వస్తువుల్ని గుర్తుపెట్టుకోవడానికి తెగ ఇబ్బందిపడిపోతుంటారు. కానీ, చైనాకు చెందిన ఓ బాలుడు మాత్రం డెలివరీకి సిద్ధంగా ఉన్న తల్లికి ఏకంగా కాన్పే చేశాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల మేరకు... కొద్దిరోజుల క్రితం ఫుజియాన్‌కు చెందిన ఓ 13 ఏళ్ల బాలుడు ఎమర్జెన్సీ సెంటర్‌కు ఫోన్ చేశాడు. తన తల్లి 37 వారాల గర్భవతిగా ఉందని, నొప్పులు కూడా వస్తున్నాయని చెప్పాడు. తల్లికి ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాడు. ఎమర్జెన్సీ సెంటర్‌లోని పారా మెడికల్ చెన్చావోసెన్ బాలుడికి ధైర్యం చెప్పింది. ఏం చేయాలో అతడికి సూచనలు చేసింది.


అతడు ఆమె చెప్పిన ప్రకారం తల్లికి డెలివరీ చేయటం మొదలెట్టాడు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కొద్దిసేపటి తర్వాత మెడికల్ టీం అక్కడికి చేరుకుంది. బాబును, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఇక, తల్లికి కాన్పు చేసిన 13 ఏళ్ల బాలుడి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బాలుడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం బాలుడ్ని తిడుతున్నారు. ‘ ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు. నిండు గర్భవతిని, పిల్లాడిని అలా ఒంటరిగా ఇంట్లో ఎలా వదిలేసి వెళతారు. భర్త, ఇతర కుటుంబసభ్యులు బాధ్యత లేకుండా ఉన్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


యూట్యూబ్ చూసి భార్యకు కాన్పు

కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చూసి భార్యకు కాన్పు చేశాడు. మాదేశ్,లోకనాయకి భార్యాభర్తలు. ఈ ఇద్దరూ అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేసి ఇంటి పెరట్లో సేంద్రియ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. లోకనాయకి గర్భం దాల్చింది. ప్రసవం కూడా సహజ సిద్ధంగా జరగాలని భార్యాభర్తలు భావించారు. ఇందుకోసం మాదేశ్ యూట్యూబ్‌లోని వీడియోలు చూసి, కాన్పు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. లోకనాయకికి నొప్పులు మొదలయ్యాయి. యూట్యూబ్ పరిజ్ణానంతో అతడు ఆమెకు కాన్పు చేశాడు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె తీవ్ర రక్త స్రావానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు.


ఇవి కూడా చదవండి:

అదృష్టం అంటే ఈమెదే.. వెయ్యి పెట్టి కొంటే 8 కోట్లు..

ఓరి నీ వేషాలు

Updated Date - Mar 31 , 2025 | 11:52 AM