Share News

Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:50 PM

మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో మట్టి లోహ నిక్షేపాలను కనుగొన్నట్లు ఆ దేశ పరిశ్రమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కజకిస్తాన్‌లో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద అరుదైన మట్టి లోహ నిక్షేప ప్రదేశం ఇదేనని ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Kazakhstan: చర్చనీయాంశంగా మారిన కజకిస్తాన్ దేశం.. అక్కడ దొరికింది చూస్తే..
Kazakhstan

ఇంటర్నెట్ డెస్క్: కజకిస్తాన్‌(Kazakhstan) దేశానికి అదృష్టం కలిసోచ్చింది. దేశ భవిష్యత్తు మార్చే అరుదైన అవకాశం లభించింది. ఆ దేశ ప్రజలను ధనవంతులను చేసే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పరిశోధనల్లో అత్యంత విలువైన మట్టి లోహ నిక్షేపాలు(Earth metal deposits) బయటపడ్డాయి. వీటి విలువ లక్షల కోట్లు రూపాయలు ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ దేశం దిశదశ మారబోతోందని అంతర్జాతీయంగా ప్రచారం జోరందుకుంది.


మధ్య ఆసియా దేశమైన కజకిస్తాన్‌లో మట్టి లోహ నిక్షేపాలను కనుగొన్నట్లు ఆ దేశ పరిశ్రమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కజకిస్తాన్‌లో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద అరుదైన మట్టి లోహ నిక్షేప ప్రదేశం ఇదేనని ఆ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరగండ అభయారణ్యంలో ఈ అరుదైన మట్టి లోహాలను గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడ దాదాపు 20 మిలియన్ టన్నుల మూలకం ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు. వీటిలో సీరియం, లాంతనం, నియోడైమియం, యట్రియం వంటివి ఉన్నట్లు వెల్లడించారు.


ఈ అరుదైన లోహాలు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చాలా కీలకమని.. అంతేకాకుండా, చైనా, రష్యా, అమెరికా, యూరప్‌ దేశాల్లో వాటికి భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు. కజకిస్తాన్ భవిష్యత్, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇవి ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. అయితే ఆ ప్రదేశంలో ఇంకా పరిశోధనలు జరిగితే కజకిస్తాన్ తలరాత పూర్తిగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే అరుదైన మట్టి లోహాల నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో కజకిస్తాన్‌ చేరబోతోందని చెప్పుకొచ్చారు.


అయితే ప్రస్తుతం ఆ నిక్షేపాలను వెలికి తీసే సాంకేతిక పరిజ్ఞానం కజకిస్తాన్ వద్ద లేదు. అందుకే విదేశీ పెట్టుబడుల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాలు సైతం దీన్ని ఒక అవకాశంగా మార్చుకునేందుకు చూస్తున్నట్లు సమాచారం. ఈ దేశంతో చర్చలు జరిగి ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్- మధ్య ఆసియా శిఖరాగ్ర సమావేశానికి ముందే ఈ విషయం వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijaya Dairy Price Revision: పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన విజయ డెయిరీ..

బంగారం తనఖా పెట్టి అప్పు తీసుకుంటే.. ఇవి తప్పక తెలుసుకోండి..

YS Sharmila: జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయుల కన్నా ఆస్తులే ఎక్కువ: వైఎస్ షర్మిలా రెడ్డి..

Updated Date - Apr 04 , 2025 | 05:53 PM